Asianet News TeluguAsianet News Telugu

ఇంటి దగ్గర వదిలిపెడతానంటే బావ బైక్ ఎక్కిన మరదలు.. ఆమెతో మందు తాగించి, మరో నలుగురితో కలిసి...

బైక్ పై ఎక్కించుకొని ఇంటి దగ్గర వదలిపెడతానంటే ఆమె నమ్మింది. బైక్ నడిపేది తన బావే కదా అని ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కింది. కానీ కొంత దూరం వెళ్లిన తరువాత మద్యం తాగించి మరదలిపై మరో నలుగురితో కలిసి అతడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది.

Brother-in-law gang-raped a married woman along with four others.. Incident in UP..ISR
Author
First Published Oct 11, 2023, 9:39 AM IST

వరసకు బావే కదా అని బైక్ ఎక్కితే ఆ మరదలకు చేదు అనుభవం ఎదురైంది. తన మరదలుకు అప్పటికే పెళ్లయ్యిందని కూడా చూడకుండా ఆ బావ ఘోరానికి ఒడిగట్టాడు. ఆమెతో మందు బలవంతంగా మందు తాగించి, మత్తు ఎక్కిన తరువాత మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

15 నుంచి రంగంలోకి కేసీఆర్‌.! తొలి సభ అక్కడి నుంచే..

వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని ఇటావా జిల్లా బస్రేహర్ ప్రాంతంలో 32 ఏళ్ల మహిళ తన భర్త, అత్తామామలతో కలిసి జీవిస్తోంది. ఆమె కొన్నేళ్ల కిందట వివాహం అయ్యింది. అయితే ఇటీవల ఆమె తన పుట్టింటికి వెళ్లి రావాలని భావించింది. ఇంట్లో భర్త, అత్తమామకు చెప్పి తన తల్లిగారింటికి కాలినడకన బయలుదేరింది. ఇలా వెళ్తూ ఉండగా ఎదురుగా తన బావ బైక్ పై వచ్చాడు.

పెళ్లయిన తన మరదలిని చూస్తే అతడికి దుర్భుద్ధి కలిగింది. ఆమెను చూడగానే బైక్ ను ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నావని ఆరా తీశాడు. పుట్టింటికి వెళ్తున్నాని ఆమె బదులిచ్చింది. తాను బైక్ పై ఇంటి దగ్గర వదిలిపెడతానని అతడు చెప్పింది. బావే కదా అని ఆమె ఎలాంటి సంకోచం లేకుండా బైక్ ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తరువాత అతడు బైక్ ఆపాడు. ట్యాంక్ కవర్ లో ఉన్న మద్యం సీసాలను బయట పెట్టాడు. ఇది చూసి మరదలు షాక్ కు గురయ్యింది.

ఇజ్రాయెల్ కు భారత్ అండగా ఉంటుంది - నెతన్యాహుతో ఫోన్ లో ప్రధాని నరేంద్ర మోడీ..

కానీ చేసేదేమీ లేక అలాగే ఉండిపోయింది. అతడు మందు తాగే క్రమంలో మరదలిని కూడా తాగాలని బలవంతం చేశాడు. ఆమె మొదట్లో వద్దని చెప్పినప్పటికీ.. చివరికి ఒప్పుకోక తప్పలేదు. ఆమెకు కూడా మందు పోసి తాగించాడు. కొంత సమయం తరువాత ఆమెకు మత్తు ఎక్కింది. తరువాత మళ్లీ ఆమెను బైక్ పై ఎక్కించుకొని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆపాడు. 

అయితే అప్పటికే అతడి నలుగురు ఫ్రెండ్స్ వీరి కోసం ఎదురుచూస్తున్నారు. వారిని చూసి మరదలు షాక్ అయ్యింది. కానీ ఇక్కడ మందు తాగి ఇంటికి వెళ్దామని అతడు ఆమెకు చెప్పడంతో.. వేరే మార్గం లేక దానికి ఒప్పుకుంది. అక్కడ వారంతా కలిసి మళ్లీ మందు తాగారు. ఈ క్రమంలో ఆమె మత్తు వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తరువాత ఆ ఐదుగురు కలిసి ఆమె సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. కొంత సమయం తరువాత ఆమెకు మెలుకువ వచ్చింది. తనపై లైంగిక దాడి జరిగిందని తెలుసుకుంది.

చాలా మిస్ అవుతున్నారా..: కొడుకును తలచుకుని కేటీఆర్ ఎమోషనల్

అనంతరం అక్కడి నుంచి దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కు వెళ్లి దుండగులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపించారు. తరువాత ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios