ఇజ్రాయెల్ కు భారత్ అండగా ఉంటుంది - నెతన్యాహుతో ఫోన్ లో ప్రధాని నరేంద్ర మోడీ..
భారత్ ఇజ్రాయెల్ కు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హమాస్ ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో భారత్ తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు.
ఇజ్రాయెల్ కు భారత్ అండగా ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను నెతన్యాహు.. మోడీకి వివరించారు.
వ్యవసాయ రంగంలోనూ లింగ న్యాయం జరగాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ విషయాన్ని ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తున్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో భారత్ తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లో ఉగ్రదాడుల వార్తలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ కు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని తెలిపారు.
ఓబీసీ, దళిత, గిరిజనుల వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కుల గణన అవసరమే - రాహుల్ గాంధీ
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ పై హమాస్ శనివారం ఆకస్మికంగా దాడి చేసింది. ఈ ఘర్షణ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాల వైపు 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ లో 900 మంది మరణించగా, 2,600 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారని, 4,000 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దక్షిణ ప్రాంతంలో సమర్థవంతమైన నియంత్రణ సాధించామని, సరిహద్దుపై పూర్తి నియంత్రణను పునరుద్ధరించామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1,500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. కంచె గుండా ఒక్క ఉగ్రవాది కూడా ప్రవేశించలేడని రియర్ అడ్మిరల్ డేనియల్ తెలిపారు. చివరి రోజు ఒక్క ఉగ్రవాది కూడా కంచె గుండా లోపలికి ప్రవేశించలేదని చెప్పారు. దాక్కున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ భూభాగంలో ఇంకా తక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది.