బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను ప్రభుత్వం రక్షిస్తోందని రెజ్లర్ వినేశ్ ఫొగట్ అన్నారు. అందుకే ఆయనను అరెస్టు చేయడం లేదని ఆమె ఆరోపించారు. హర్యానాలో నిరసన తెలుపుతున్న రైతులకు ఆమె సంఘీభావం తెలిపిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వినేశ్ ఫొగట్ ఆరోపించారు. డబుల్ వరల్డ్ మెడలిస్ట్ అయిన ఫోగట్ ఆదివారం పంజాబ్ లో ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి హర్యానాలోని ఖట్కర్ టోల్ ప్లాజా వద్ద మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిపిన సమావేశాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. ‘‘వారు (అమిత్ షా)మాకు చాలా చేయగలరని, కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు, కాని బ్రిజ్ భూషణ్ అరెస్టు మినహా, అంతా జరుగుతోంది’’ అని అన్నారు.
గంగా జమ్నా స్కూల్ హిజాబ్ వివాదం : ప్రిన్సిపల్ తో పాటు మరో ఇద్దరి అరెస్ట్.. అసలేం జరిగిందంటే ?
ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని మీడియా ప్రశ్నించగా.. ఫైర్ బ్రాండ్ రెజ్లర్ ఎదురుదాడికి దిగారు. ‘‘డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని అమిత్ షాను అడగాలి. ఆయన ఎంతో శక్తిమంతుడు కాబట్టే ప్రభుత్వం ఆయన్ను కాపాడే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి అతడిని అరెస్టు చేయడం అంత సులభం కాదు. కానీ మేము మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ’’ అని అన్నారు.
దాదాపు ఏడాది గడిచిపోయినా ఆందోళనకారుల ఆందోళన కొనసాగుతూనే ఉందని, తమ నిరసన ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేనని ఫొగాట్ అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసిన రోజే తాము నిరసనను విరమిస్తామని చెప్పారు. కానీ న్యాయం ఆలస్యంగా వస్తే ఏం లాభమని అన్నారు.
తమ పోరాటం ఏదో ఒక రోజు ముగిసిపోవచ్చునని, కానీ దేశంలోని సీనియర్లు ఇంకా పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘‘మేము వారితో ఉన్నాం, కాబట్టి ఈ భూమిపై కొన్ని పోరాటాలు ముగియవు. ప్రజలు అమరులవుతున్నారు, ప్రజలు శోకసంద్రంలో ఉన్నారు, నిరుద్యోగం యువతను పట్టి పీడిస్తోంది, వీటన్నింటిపై ప్రభుత్వం ఆలోచించాలి.’’ అని అన్నారు. ‘‘ఇంతమంది గళం విప్పేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం వినాలి. ప్రభుత్వం వాటిని ఉపేక్షించకూడదు.’’ అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి బదులు రాచరికం కొనసాగుతోందని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. అందులో ఎలాంటి సందేహమూ లేదని అన్నారు.
శరీరాన్ని అసభ్యంగా తాకుతూ, 40 మంది దాడి చేశారని ఆర్మీ జవాను భార్య
పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో ఆమె పాటియాలాకు చేరుకున్నారు.
రైతులకు విద్యుత్ కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం, పెండింగ్ లో ఉన్న గొట్టపు బావుల కనెక్షన్ల విడుదలలో జాప్యం, స్మార్ట్ మీటర్ల బిగింపుపై సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర) రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
