ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక.. ప్రేమికుడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఓ అమ్మాయి తెల్లారితే పెళ్లి పెట్టుకుని సినీ ఫక్కీలో తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం తుమకూరు మండలం దొడ్డగుళ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు.

ఆదివారం ఉదయం వివాహం జరగాల్సి వుండగా.. ఆమె అప్పటికే అత్త కొడుకు చేతన్‌ని ప్రేమించి వుండటంతో అతనితో పారిపోవడానికి పథకం వేసింది. ప్లాన్‌లో భాగంగా శనివారం రాత్రి శరీరంపై విషం చల్లుకుని విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నాటకమాడింది.

ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చేతన్ అప్పటికే ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తల్లీదండ్రులు, బంధువుల కళ్లుగప్పి చేతన్‌తో పారిపోయింది.

నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటూ ఆ విషయం ఇంట్లో చెప్పకపోడంతో ప్రేమ గురించి తెలియని యువతి తల్లిదండ్రులు వివాహం నిర్ణయించారు. దీంతో పెళ్లి ఇష్టం లేని యువతి పథకం ప్రకారం అత్త కొడుకుతో పారిపోయింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు.