Beti Bachao Beti Padhao Scheme: పథకం నిధులన్ని ప్రకటనలకే ఖర్చు !
Beti Bachao Beti Padhao Scheme: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం ‘బేటీ బచావో బేటీ పడావో’ . అయితే, ఈ పథకం అనుకున్న స్థాయిలో ఫలితాలను రాబట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే Beti Bachao Beti Padhao Scheme కు సంబంధించిన విస్తుపోయే ఒక విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 79 శాతం ప్రచారం, ప్రకటనలు ఖర్చుచేయడం తీవ్ర చర్చకు తెరలేపింది.
Beti Bachao Beti Padhao Scheme: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుచ్చిన పథకాల్లో ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం ఒకటి. అయితే, Beti Bachao Beti Padhao Scheme చాలా రాష్ట్రాల్లో సరైన పనితీరు కనబర్చడం లేదు. ఈ పథకంతో బాలికలకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదనీ, ప్రభుత్వం ప్రచారం కోసమే ఈ పథకాన్ని వాడుకుంటున్నదని ప్రతిపక్షాల ఆరోపణలు సైతం ఉన్నాయి. తాజాగా ఈ పథకానికి సంబంధించి విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 80 శాతం ప్రకటనలకు, ప్రచారం కోసమే ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. Beti Bachao Beti Padhao Scheme సంబంధించి.. బీజేపీ ఎంపీ హీనా విజయ్‌కుమార్ గవిట్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ సంచలన వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. Beti Bachao Beti Padhao Scheme కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులలో 78.91 శాతం నిధులను ఈ పథకంపై ప్రచారం, ప్రకటనల కోసం ఖర్చు చేశారు. పథకానికి కేటాయించిన నిధుల్లో ఇంత మొత్తం ప్రచారం, ప్రకటనల కోసం ఖర్చు చేయడమనేది సంచలనంగా మారింది. పథక నిధులను ఇలా నిధుల దుర్వినియోగం చేయడంపై మహిళా సాధికారత కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Also Read: Coronavirus: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా మరణాలు నమోదయ్యాయంటే?
మహారాష్ట్ర బీజేపీ లోక్‌సభ ఎంపీ హీనా విజయ్‌కుమార్ గవిత్ నేతృత్వంలోని మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ లోక్‌సభలో Beti Bachao Beti Padhao Scheme సంబంధించి మహిళల సాధికారతపై ఐదవ నివేదికను సమర్పించింది. ఇందులో ప్రస్తావించిన వివరాలు ఇలా ఉన్నాయి. Beti Bachao Beti Padhao Scheme ను ప్రారంభించిన 2014-15 నుంచి 2019-20 వరకు మొత్తం బడ్జెట్‌లో రూ.848 కోట్లు కేటాయించారు. గతేడాది కరోనా వైరస్ కారణంగా ఈ పథకానికి 2020-21 ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇక కేటాయించిన మొత్తం నిధుల్లో రాష్ట్రాలకు రూ.622.48 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేవలం 25.13 శాతం నిధులు మాత్రమే Beti Bachao Beti Padhao Scheme కోసం వెచ్చించాయి. అంటే రూ.156.46 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి. రాష్ట్రాల్లో పథకం అమలు తీరు ఏమాత్రం బాలేదని కమిటీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. 2016-2019 మధ్యకాలంలో విడుదలైన మొత్తం రూ. 446.72 కోట్లలో 78.91 శాతం మీడియా ప్రకటనలకే ఖర్చు చేసినట్టు కమిటీ పేర్కొంది. Beti Bachao Beti Padhao Scheme ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుంది, కానీ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Also Read: Coronavirus: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా మరణాలు నమోదయ్యాయంటే?
Beti Bachao Beti Padhao Scheme నిధులు ఇలా సక్రమైన రీతిలో ఉపయోగించుకోకపోవడం గురించి మహిళా శిశు సంక్షేమ శాఖ తక్షణమే స్పందించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ విషయంపై చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం Beti Bachao Beti Padhao Scheme ను తీసుకువచ్చింది. ఈ పథకాన్ని 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పఢావో పథకంతో బాలికలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆ సందర్భంగా అన్నారు. పిల్లల లింగ నిష్పత్తిలో క్షీణతను నిరోధించడంలో సహాయపడటంతో పాటు మహిళా సాధికారతకు ఉపకరిస్తుందని తెలిపారు. Beti Bachao Beti Padhao Scheme నిధులన్నీ ప్రచారం కోసమే ఖర్చు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Summit for Democracy: భారత ప్రజాస్వామ్యానికి అవే మూల స్తంభాలు.. ప్రధాని మోడీ