up assembly elections 2022: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం: టైమ్స్ నౌ పోల్
up assembly elections 2022: మరో రెండు మూడు నెలల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీనే ఘన విజయం సాధిస్తుందనీ, రెండోసారి బీజేపీ అధికారం చేపట్టి రికార్డు సృష్టిస్తుందని ఓ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది.
up assembly elections 2022: దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరో రెండు మూడు నెలల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ముందుకు సాగుతూ రాజకీయ హీటును పెంచుతున్నాయి. దేశంలో రాజకీయంగా అత్యంత ప్రధాన్యత కలిగిన ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేస్తామనీ, అధికార పీఠం దక్కించుకుంటామని అన్ని పార్టీల నాయకులు ఎవరికీవారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీనే మళ్లీ అధికార పీఠం దక్కించుకుంటుందని ఓ ఒపీనియన్ పోల్ సర్వే పేర్కొంది. వరుసగా రెండో సారి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టి రికార్డులు సృష్టిస్తారని తెలిపింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో అతి త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే పేర్కొంది. యూపీలో 403కు పైగా స్థానాలు ఉన్నాయి. ఇందులో భారత జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కూటమి 230 నుంచి 249 స్థానాలను గెలుచుకుంటుందని ఈ పోల్ సర్వే అంచనా వేసింది.
Also Read: coronavirus:యూరప్ పై కరోనా విజృంభణ.. 100 మిలియన్లకు పైగా కేసులు
ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. 2017 ఎన్నికల్లో 325 స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకుంది. ఇక మళ్లీ జరగబోయే ఎన్నికల్లోనూ బీజేపీనే విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. ఇదే గనక జరిగితే ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ 36 సంత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్ లో చరిత్రలో కొత్త రికార్డు సృష్టించనున్నారు. వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపడితే.. 1985 తర్వాత వరుసగా రెండు పర్యాయాలు సీఎం అయిన వ్యక్తిగా యోగి రికార్డు నెలకోల్పుతారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ బలమైన పోటీదారుగా సమాజ్ వాదీ పార్టీ ఉందని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతోది. ఈ పోల్ ప్రకారం... బీజేపీకి గట్టి పోటీనిస్తున్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి బాగానే పుంజుకోనుంది. ప్రస్తుత సభలో 48 స్థానాలుండగా.. 137 నుంచి 152 స్థానాల్లో విజయం సాధించొచ్చని టైమ్స్ నౌ పోల్ పేర్కొంది.
Also Read: Omicron:27వేలకు పైగా కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. కొత్తగా ఎన్నంటే?
రాష్ట్రంలోని మిగతా పార్టీలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఘోరంగా విఫలమవుతాయని టైమ్స్ నౌ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. మాయావతి ఆధర్యంలోని బీఎస్పీ మరింత బలహీనపడిపోనుందనీ, కేవలం 9 నుంచి 14 స్థానాలతో సరిపెట్టుకుంటుందని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. అంటే గత ఎన్నికల్లో బీఎస్పీ గెలులుచుకున్న స్థానాల కంటే తక్కవు. గత ఎన్నికల్లో బీఎస్పీ 19 స్థానాలు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 4-7 స్థానాలు గెలుచుకునే అవకాశముందని అంచనా వేసింది. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్ సర్వే ఆయా పార్టీలకు పడే ఓట్ల శాతాన్ని కూడా వెల్లడించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 38.6 శాతం ఓట్లు పడతాయనీ, అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ కూటమికి 34.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. బీఎస్పీ ఓటు బ్యాంకు గతంలో 22.2 శాతంగా ఉండగా అది 14.1 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.
Also Read: AP: తాలిబన్లకు ఆ నేతలకు తేడా ఏముంది?.. ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్