Asianet News TeluguAsianet News Telugu

AP: తాలిబ‌న్ల‌కు ఆ నేత‌ల‌కు తేడా ఏముంది?.. ప్ర‌తిప‌క్షాల‌పై ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఫైర్

AP: 2021 సంవత్సరం ప్రతిపక్ష పార్టీలకు ఏడుపు నామ సంత్స‌ర‌మంటూ అధికార పార్టీ నేత ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో ఆర్థిక ర‌థ‌చ‌క్రం వేగంగా క‌ద‌ల‌క‌పోయినా.. తాము అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ఆగ‌లేద‌ని అన్నారు. 
 

YCP MLA Ambati Rambabu Fires On Opposition
Author
Hyderabad, First Published Jan 1, 2022, 5:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

AP: అధికార పార్టీ వైకాపా ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన అంబ‌టి.. పోయిన ఏడాది (2021వ‌) ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఏడుపునామ సంవ‌త్స‌ర‌మంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల పైనా అంబ‌టి త‌న‌దైన స్టైల్ లో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీకి 2021 మద్యపాన సంవత్సరమని పేర్కొన్న ఆయ‌న‌.. జనసేన కు ప్యాకేజీ నామ సంవత్సరమని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం పార్టీకీ, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు డ్రామా నామ సంవత్సరం అంటూ వ్యాఖ్యానించారు. 

Also Read: Pupunjab election 2022: నాణ్య‌మైన విద్య.. అంబేద్కర్ క‌ల‌ను సాకారం చేస్తాం: కేజ్రీవాల్

అలాగే, క‌మ్యూనిస్టుల‌ను కూడా వ‌ద‌ల్లేదు అంబ‌టి రాంబాబు. కమ్యూనిస్టు పార్టీలకు భూస్వామ్య అనుకూల పోరాటాలు చేసి భ్రష్టు పట్టిన సంవత్సరం అంటూ విమ‌ర్శించారు.  మొత్తంగా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలకు 2021 ఏడుపు నామ సంవత్సరం అని పేర్కొన్నారు. బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించిన అంబ‌టి..  తాలిబన్లకు బీజేపీ నేతలకు తేడా ఏముంది అంటూ ప్ర‌శ్నించారు. బీజేపీ భారతీయ జూద పార్టీనా అంటూ మండిపడ్డారు. జిన్నా టవర్ ను పేల్చివేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆప్ఘనిస్థాన్ లో బుద్ధుడి విగ్రహాన్ని కూల్చేసిన తాలిబన్లకు బీజేపీ నేతలకు తేడా ఏముంది అంటూ ప్రశ్నించారు. అద్వానీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి జెండా సమాధిని సందర్శించారని, అద్వానీ చర్యను బీజేపీ నేతలు ఖండిస్తారా అంటూ ప్రశ్నించారు. 1943లో జిన్నా టవర్ ను నిర్మించారని ఇన్నేళ్లు బీజేపీ గుడి గుర్రాల పళ్ళు తోముతుందా అంటూ మండిపడ్డారు. అలాగే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా, వారితో జ‌ట్టుక‌ట్టిన బీజేపీ ఆ స‌మ‌యంలో ఏం చేసిందో చెప్పాలన్నారు. చీప్ లిక్కర్ పోసి ఓట్లు సంపాదించాలనుకునే చీప్ పార్టీ బీజేపీ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

Also Read: crimes against women: మ‌హిళ‌ల‌పై పెరుగుతున్న హింస‌.. 2021లో 30 వేల‌కు పైగా ఫిర్యాదులు: ఎన్‌సీడ‌బ్ల్యూ

త‌మ పాల‌న గురించి మాట్లాడిన ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. 2021 మాత్రం అధికార వైకాపాకు మాత్రం అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమ‌ని పేర్కొన్నారు. 2021 సంవత్సరం లో వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీని అన్ని విజయాలు వరించాయని అన్నారు. రాష్ట్ర  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము మెరుగైన పాల‌న అందిస్తున్నందుకే ప్ర‌జ‌లు త‌మ‌కు అండ‌గా నిలుస్తున్నార‌ని తెలిపారు. దీనికి నిద‌ర్శ‌న‌మే... ఎక్కడ ఎన్నికలు పెట్టిన అద్భుతమైన విజయాలు సాధించామ‌నీ, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2021 మహత్తరమైన సంవత్సరం అని అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రలో ఆర్థిక రథచక్రం వేగంగా  కదలలేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాలు ఆగలేదని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు నెర‌వేరుస్తామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. హామీలు నెర‌వేర్చ‌డంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. మ‌ద్యం పై ప్ర‌భుత్వ విధానాలు మార‌డం స‌హాజ‌మేన‌ని అన్న ఆయ‌న‌.. దానిలో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. త‌మ మెరుగైన పాల‌న చేసి ప్ర‌తిప‌క్ష పార్టీల కడుపులు మండిపోతున్నాయ‌ని అన్నారు.

Also Read: CM YS Jagan: అలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించే వాళ్లేనా? సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై సీఎం జగన్..

Follow Us:
Download App:
  • android
  • ios