Asianet News TeluguAsianet News Telugu

coronavirus:యూర‌ప్ పై క‌రోనా విజృంభ‌ణ‌.. 100 మిలియ‌న్ల‌కు పైగా కేసులు

coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా విజృంభ‌ణ మ‌ళ్లీ మొద‌లైంది. ఒమిక్రాన్ వేరియంట్ త‌ర్వాత కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. యూర‌ప్ (Europe) క‌రోనా హాట్ స్పాట్‌గా మారింది. ఏకంగా 100 మిలియ‌న్ల‌కు పైగా కేసులు యూర‌ప్‌లోనే న‌మోద‌య్యాయి.
 

Europe Records Over 100 Million Covid Cases Since Start Of Pandemic: Report
Author
Hyderabad, First Published Jan 2, 2022, 10:55 AM IST

coronavirus: 2019లో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్టింది. లక్ష‌లాది మంది ప్రాణాలు తీసుకుంది. కోట్లాది మందిని అనారోగ్యానికి గురించేసింది. ఇదివ‌ర‌కు డెల్టా వేరియంట్ కారణంగా ప్ర‌పంచం మొత్తం సంక్షోభం లోకి వెళ్లింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికాలో 2021 న‌వంబ‌ర్ లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఈ వేరియంట్‌.. దాదాపు స‌గానికి సైగా దేశాల‌కు విస్త‌రించింది. ఈ కేసులు వెలుగుచూసిన దేశాల్లో త‌క్క‌వు కాలంలోనే రికార్డు స్థాయిలో కొత్త  క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. యూర‌ప్ లో క‌రోనా క‌ల్లోల‌మే రేపుతున్న‌ది. క‌రోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్ప‌టివ‌ర‌కు యూర‌ప్ లో 100 మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు న‌మోదుకావ‌డం అక్క‌డి క‌రోనా ఉధృతి ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ప్రపంచవ్యాప్తంగా న‌మోదైన మొత్తం క‌రోనా వైర‌స్ కేసుల్లో మూడింట ఒక వంతు యూర‌ప్ (Europe) లోనే న‌మోద‌య్యాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Also Read: Omicron:27వేలకు పైగా కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. కొత్త‌గా ఎన్నంటే?

ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన త‌ర్వాత మ‌ళ్లీ క‌రోనా హాట్‌స్పాట్ కేంద్రంగా యూర‌ప్ మారింది. గ‌త కొన్ని నెల‌లుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ తో పోరాడుతోంది.  అట్లాంటిక్ తీరం నుంచి ర‌ష్యా వరకు 52 దేశాలు, ఇత‌ర యూరిపోయిన భూభాగాల్లో గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో మొత్తం 100,074,753 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. చైనాలో 2019లో క‌రోనా వైర‌స్ వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా 289,713,817 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అంటే మూడింట ఒక వంతు కంటే అధికంగా క‌రోనా కేసులు ఒక్క యూర‌ప్ లోనే న‌మోద‌య్యాయి. అయితే, గ‌త వారం రోజుల్లోనే యూరోపియన్  దేశాల్లో 4.9 మిలియన్లకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. క‌రోనా వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి ఇవే కేసులే అత్య‌ధిక‌మ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గ‌త వారం ఒక్క ఫ్రాన్స్ లోనే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త కేసులను నమోదయ్యాయి. అక్క‌డ వెలుగుచూసిన క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప్ర‌క‌టించిన అన్ని సానుకూల కేసులలో 10 శాతానికి సమానం. ల‌క్ష మంది జ‌నాభాకు క‌రోనా వ్యాప్తి నిష్ప‌త్తి రేటు అధికంగా ఉన్న దేశాలు సైతం యూర‌ప్‌లోనే ఉన్నాయి.  అయితే, అధికారిక లెక్క‌లు ఇలా ఉన్న‌ప్ప‌టికీ.. గ‌ణాంకాల్లో ప‌ర‌గిణించని కేసులు అధికంగా వుండ‌వ‌చ్చున‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌ర‌ణాలు సైతం అక్క‌డ క్ర‌మంగా పెరుగుతున్నాయి.

Also Read: AP: తాలిబ‌న్ల‌కు ఆ నేత‌ల‌కు తేడా ఏముంది?.. ప్ర‌తిప‌క్షాల‌పై ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఫైర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా టీకాలు అందించిన వివ‌రాలు గ‌మనిస్తే.. ఒక్క ఐరోపాలోనే ప్ర‌పంచ స‌గ‌టు కంటే అధికంగా కోవిడ్ టీకాలు అందించారు. బూస్ట‌ర్ డోసులు సైతం అందాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అధికారికంగా న‌మోదైన ప్ర‌పంచ వ్యాప్త మ‌ర‌ణాల్లో లెక్క‌ల్లోకి రానివి చాలానే ఉన్నాయ‌ని, వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే రెండు లేదా మూడు రెట్లు అధికంగా ఉంటాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.  ఇదిలావుండ‌గా, ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 289,712,665 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనా వైరస్ తో పోరాడుతూ 5,546,079 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన వారిలో 25,41,52,060 మంది కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి రోజువారి కొత్త కేసులు దాదాపు 20 లక్షలకు దగ్గరగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. మరణాలు సైతం పెరుగుతున్నాయి. నిత్యం దాదాపు 10 వేల కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, ఫ్రాన్స్, టర్కీ, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇరాన్, అర్జెంటీనా, కొలంబియా దేశాలు టాప్ ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

Also Read: Pupunjab election 2022: నాణ్య‌మైన విద్య.. అంబేద్కర్ క‌ల‌ను సాకారం చేస్తాం: కేజ్రీవాల్

Follow Us:
Download App:
  • android
  • ios