హత్యలు చేసి నిరసనకారుల నోరు మూయలేరు. అహంకారపూరిత, క్రూరత్వ సందేశాలు వారి మెదళ్లలోకి వెళ్లక ముందే వెంటనే న్యాయం జరగాలి అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన ఓ వీడియోనూ ఆయన జతచేశారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటనపై bjp ఎంపీ varun gandhi మరోసారి ఫైర్ అయ్యారు. మొదటి నుంచీ ఆయన farmersకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. రైతులపై దూసుకెళ్తున్న వాహనాలను చూపిస్తున్న videoను ఆయన మంగళవారం పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో వీడియో పోస్టు చేస్తూ ఇది క్రిస్టల్ క్లియర్‌గా వ్యవహారాన్ని వెల్లడిస్తున్నదని పేర్కొన్నారు.

‘ఈ వీడియో క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నది. హత్యలు చేసి నిరసనకారుల నోరు మూయలేరు. అమాయక రైతుల రక్తానికి కచ్చితంగా జవాబుదారీ ఉండాల్సిందే. న్యాయం సత్వరమే చేకూరాలి. అహంకారం, క్రూరత్వ సందేశాలు రైతుల హృదయాలకు చేరే ముప్పు ఉన్నదని, వెంటనే న్యాయం జరగాలి’ అని డిమాండ్ చేశారు.

Scroll to load tweet…

మంగళవారం కూడా ఆయన ఇలాంటి వీడియోను ఒకదాన్ని పోస్టు చేశారు. రైతులపై నుంచి దూసుకెళ్తున్న దృశ్యాలను చూపిస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసులను కలచివేస్తుందని పేర్కొన్నారు. పోలీసులు ఈ వీడియోను పరిగణనలోకి తీసుకోవాలని, కారు ఓనర్‌ను గుర్తించాలని, కారులో ఉన్నవారిని, ఈ ఘటనతో ప్రమేయమున్నవారిని పట్టుకోవాలని సూచించారు.

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా, Uttar pradesh డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు పాల్గొంటున్న ఓ కార్యక్రమానికి నిరసనగా రైతులు lakhimpur kheriలో నిరసనలు చేస్తున్నారు. వారి వెనుక నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కాన్వాయ్ వారిపై నుంచి దూసుకెళ్లింది. వరుణ్ గాంధీ ట్వీట్ చేసిన వీడియోలు ఆ కార్లపై దాడి జరిగినట్టుగా కనిపించడం లేదు. కావాలనే ఆందోళనకారులపైకి కారు దూసుకెళ్లినట్టు వీడియో చూపిస్తున్నది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, కాన్వాయ్‌లోని మరో నలుగురిని కొట్టి చంపారు.