కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పౌరసత్వం తొందరలోనే రద్దయ్యే అవకాశం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన పలు కీలక అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Also Read:కాంగ్రెస్ చీఫ్ రాహుల్ కి డ్రగ్స్ అలవాటుంది : సుబ్రహ్మణ్యస్వామి

సోనియా గాంధీకి ఇటలీ పాస్‌పోర్ట్ ఉందని ఇందుకు సంబంధించిన ఫైలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టేబుల్ పైనే ఉందని, ఏ క్షణంలోనైనా సోనియాగాంధీ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

దేశంలో ఎవరైనా వచ్చి ఉండేందుకు  భారత్ ధర్మసత్రం కాదన్నారు. ఈ దేశంలో 82 శాతం మంది హిందువులు అని, దేశంలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు కూడా హిందువులే అని వ్యాఖ్యానించారు. సిఏఏ బిల్లును లోక్ సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఎన్ని ఆందోళనలు చేసినా ఏమీ లాభం లేదని సుబ్రమణ్య స్వామి తేల్చి చెప్పారు. 

Also Read:కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలి: సుబ్రమణ్యస్వామి

కాంగ్రెసు పార్టీ నేతలు ఎవరైనా తనతో సీఏఏ బిల్లుపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ సిద్ధంగానే ఉన్నా ఆయనతో మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న ముస్లింలకు సీఏఏ బిల్లుతో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు