కాంగ్రెస్ చీఫ్ రాహుల్ కి డ్రగ్స్ అలవాటుంది : సుబ్రహ్మణ్యస్వామి

Rahul Gandhi is a drug addict  -  bjp mp Subramanian Swamy
Highlights

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే ఈ విషయం బైటపడుతుందని స్వామి ఆరోపించారు. ఆయన ముఖ్యంగా కొకైన్ అనే మాధకద్రవ్యాన్ని తీసుకుంటారంటూ ఆరోపించి స్వామి పెద్ద దుమారాన్ని రేపారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్ గాంధీ పై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే ఈ విషయం బైటపడుతుందని స్వామి ఆరోపించారు. ఆయన ముఖ్యంగా కొకైన్ అనే మాధకద్రవ్యాన్ని తీసుకుంటారంటూ ఆరోపించి స్వామి పెద్ద దుమారాన్ని రేపారు.

పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు ప్రతి ఏడాది డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సుబ్రహ్మణ్య స్వామి పై విధంగా జవాభిచ్చారు. 

కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ కూడా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై వ్యంగాస్త్రాలు సంధించారు. ముందు కాంగ్రెస్ పార్టీలోని డ్రగ్స్ అలవాటుదారులకు డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. ఈ డోపింగ్ టెస్ట్ రాహుల్ నుండి ప్రారంభిస్తే మంచిదంటూ వ్యాఖ్యానించారు. 

గతంలోను రాహుల్ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఒక హోమో సెక్సువల్ అంటూ ఆరోపించారు. ఆయనకు డ్రగ్స్  అలవాటుందని గతంలోనే విమర్శలు చేశారు స్వామి. అలాగే రాహుల్ ను ఇటాలియన్ పాస్ పోర్టు హోల్డర్ అంటూ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై మాట్లాడుతూ మరోసారి రాహుల్ ని టార్గెట్ చేశారు. 

loader