ముస్లింతో లేచిపోయిన యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించి మనసు మార్చిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ట్విస్ట్ ఏంటంటే ?
ఓ ముస్లిం యువకుడితో హిందూ యువతి లేచిపోయింది. ఈ విషయం బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కు తెలిసింది. దీంతో ఆమె యువతి దగ్గరికి చేరుకొని నచ్చజెప్పింది. ఆమె మనసు మార్చేందుకు ‘ది కేరళ స్టోరీ’ సినిమా కూడా చూపించింది. దీంతో ఆ యువతి ఒప్పుకొని ఇంటికి వెళ్లింది. కానీ తరువాత ఏం జరిగిందంటే ?
ముస్లిం ప్రియుడితో పారిపోయిన 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని హెచ్చరించడానికి బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ 'ది కేరళ స్టోరీ' సినిమాను చూపించారు. ఆమెను పెళ్లి విరమించుకునేలా ఒప్పించారు. వారం రోజుల పాటు తన తల్లింద్రులతో ఉన్న ఆ యువతి.. మళ్లీ ఇంట్లో నుంచి డబ్బులు, నగలు తీసుకుని అతడితో లేచిపోయింది.
ప్రేయసి మాట్లాడటం లేదని.. ట్రైన్ సిగ్నల్ ధ్వంసం చేసిన యువకుడు
‘ఏబీపీ న్యూస్’ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాకు చెందిన ఓ యువతి ముస్లిం వర్గానికి చెందిన తన ప్రియుడితో కలిసి మే 11వ తేదీన ఇంటి నుంచి పారిపోయింది. అయితే సాయంత్రం సమయంలో బురఖా ధరించి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఈ విషయం బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కు చేరింది. దీంతో ఆమె ఆ యువతికి ఫోన్ చేసి ప్రియుడు యూసుఫ్ ను పెళ్లి చేసుకోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ యువతి వినలేదు. దీంతో ఎంపీ ఆమెను తీసుకొని ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసేందుకు వెళ్లారు.
తరువాత ఆ యువతి కొంత సందిగ్ధత లోనయ్యింది. అప్పటికి ఆ ముస్లిం యువకుడితో పెళ్లి వద్దనుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఎంతో నచ్చజెప్పేందుకు, మనసు మార్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువతి చివరికి తన నిర్ణయంవైపే మొగ్గు చూపింది. మే నెల 18,19 తేదీ అర్ధరాత్రి సమయంలో బంగారు నగలు, రూ.70 వేల నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై భోపాల్ లోని కమలా నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది.
గంగా జమునా స్కూల్ వివాదం : మేము ఇష్ట ప్రకారమే ముస్లిం మతంలోకి వచ్చాం.. స్పష్టతనిచ్చిన మహిళా టీచర్లు
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'ది కేరళ స్టోరీ' సినిమా.. దక్షిణాది రాష్ట్రంలో కనిపించకుండా పోయిన పలువురు మహిళలు ముస్లిం మతంలోకి మారారాని, తరువాత బలవంతంగా ఉగ్రవాద సంస్థలకు తరలివెళ్లాల్సి వచ్చిందనే నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా మొదటి నుంచి వివాదానికి గురైంది. దీనిపై రాజకీయ పార్టీలు వ్యాఖ్యానించాయి. ఈ సినిమా విడుదల అంశం పలు రాష్ట్రాల హైకోర్టు, చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది.
ఒడిశాలో రైలు ప్రమాదం : రూ.2000 నోట్ల విషయంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగిందంటే ?
పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ చిత్రాన్ని నిషేధించగా, అధికార భారతీయ జనతా పార్టీ సభ్యులు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో ఈ కథాంశం వివాదానికి దారితీసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ఈ సినిమాను టాక్స్ ఫ్రీగా ప్రకటించారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిల్మ్ మేకర్స్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సినిమాను రాష్ట్రంలో అనధికారికంగా నిషేధించడంపై సుప్రీంకోర్టు తమిళనాడుకు నోటీసులు జారీ చేసింది.