ప్రేయసి మాట్లాడటం లేదని.. ట్రైన్ సిగ్నల్ ధ్వంసం చేసిన యువకుడు

తన ప్రియురాలు మాట్లాడటం లేదనే కోపంతో ఓ యువకుడు ట్రైన్ సిగ్నల్ ను రాళ్లతో పగులగొట్టాడు. తమిళనాడులోని తిరుప్పత్తూర్‌ రైల్వే స్టేషన్‌ లో ఈ ఘటన జరిగింది. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 

A young man vandalized a train signal in Tamil Nadu..ISR

ప్రేయసి తనతో మాట్లాడటం లేదనే కోపంతో ఓ యువకుడు ట్రైన్ సిగ్నల్ ధ్వంసం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పత్తూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఆ యువకుడి వింత చర్య ఎందరినో ఆందోళనకు గురి చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

గంగా జమునా స్కూల్ వివాదం : మేము ఇష్ట ప్రకారమే ముస్లిం మతంలోకి వచ్చాం.. స్పష్టతనిచ్చిన మహిళా టీచర్లు

వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం తిరుప్పత్తూర్‌ స్టేషన్‌లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులందరూ తమ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తిరుప్పత్తూరు బ్రాన్‌లైన్‌కు చెందిన 30 ఏళ్ల గోకుల్‌ ఆ స్టేషన్ కు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న రైలు సిగ్నల్ పోల్ వద్దకు వెళ్లాడు. సిగ్నల్స్ ను సూచించే లైట్లను రాళ్లతో కొట్టాడు. దీంతో అవి పగిలిపోయాయి. 

ఒడిశాలో రైలు ప్రమాదం : రూ.2000 నోట్ల విషయంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగిందంటే ?

యువకుడు సిగ్నల్ లైట్లపై దాడి చేయడంతో ఆ చుట్టుపక్కలే ఉన్న పోలీసులకు శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడి చర్యను అడ్డుకొని వెంటనే అదుపులోకి తీసుకున్నాడు. ఆ సమయంలో ఆ యువకుడు మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డావని పోలీసులు విచారించడంతో.. తన ఓ యువతిని ప్రేమించానని చెప్పాడు. అయితే ఆమె తనతో మాట్లాడటం లేదని, అందుకే కోపం వచ్చి సిగ్నల్ ను ధ్వంసం చేశానని తెలిపాడు.

పెళ్లైన తెల్లారే అత్తగారింటినుంచి చెల్లెను కిడ్నాప్ చేసిన అన్న.. ఎందుకంటే..

ఒడిశా రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోకముందే తిరుప్పతూర్ ప్రాంతంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios