Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ఎంపీ కారు అద్దాలు పగులగొట్టిన రైతు ఆందోళనకారులు.. హర్యానాలో ఉద్రిక్తతలు

హర్యానాలోని హిసార్ జిల్లాలో బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా కార్యక్రమాన్ని పెద్దమొత్తంలో రైతులు నిరసనగా బయల్దేరి అడ్డుకున్నారు. ఇక్కడ పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఎంపీ కారు అద్దాలను కొందరు పగులగొట్టారు. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నది రైతులే కాదనీ, వారంతా ఊళ్లల్లోని పనిలేని తాగుబోతులేనని బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా నిన్న రోహతక్‌లో నోరుపారేసుకున్నారు. దీనికి ప్రతిగానే తాజా ఆందోళన జరిగినట్టు అభిప్రాయాలు వస్తున్నాయి.

bjp mp car glass smashed in haryana in a farmers protest
Author
Hisar, First Published Nov 5, 2021, 3:37 PM IST

చండీగడ్: Haryanaలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. BJP ఎంపీ రామ్ చందర్ జంగ్రాను రైతు ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. Farmersను కట్టడి చేయడానికి Policeలు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు MP Ram Chander Jangra కారు అద్దాలు పగులగొట్టారు. తన Carను డ్యామేజీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ జంగ్రా డిమాండ్ చేశారు. పోలీసులు కొందరు అనుమానిత రైతులను అరెస్టు చేశారు.

బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా ఈ రోజు హర్యానాలోని Hisar జిల్లాకు వచ్చారు. నర్నాంద్ పట్టణంలోని ధర్మశాలను ప్రారంభించడానికి ఆయన వచ్చారు. కానీ, ఆయన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రైతులు గుంపులుగా చేరారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నలుపు రంగు జెండాలతో నిరసన తెలియజేశారు. ఇది ఊహించి ముందుగానే పోలీసులు బందోబస్తు చేశారు. కానీ, రైతులు అనూహ్య సంఖ్యలో రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టమైంది. రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

నిన్న కూడా రోహతక్‌లో ఎంపీ జంగ్రాకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. నిన్నటి కార్యక్రమం తర్వాత ఆయన రైతు ఆందోళనలపై నోరుపారేసుకున్నారు. ఆ వ్యాఖ్యలతోనే ఈ రోజు తీవ్ర నిరసన ఎదురైనట్టు తెలుస్తున్నది. రోహతక్‌లో కార్యక్రమం తర్వాత ఎంపీ రామ్ చందర్ జంగ్రా విలేకరులతో మాట్లాడారు.

Also Read: హర్యానా ఎల్లెనాబాద్ ఉపఎన్నికలో ‘రైతుల విజయం’.. ఆరువేల మెజార్టీతో అభయ్ గెలుపు

అసలు సాగు చట్టాలకు వ్యతిరేకతే లేదని అన్నారు. ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నవారు రైతులే కాదనీ, వారంతా ఊళ్లల్లోని పనిలేని నిరుద్యోగ తాగుబోతులు మాత్రమేనని నోరుపారేసుకున్నారు. ఇలాంటి శక్తులే అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సింఘు బార్డర్‌లో ఇటీవలే నిహంగ్‌లు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటనే ప్రజలకు రైతు ఆందోళనల అసలు రూపాన్ని చూపించాయని ఆరోపణలు చేశారు. వారు అసలు రైతులే కాదనీ, ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా వారిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తాను ఢిల్లీకి రెగ్యులర్‌గా వెళ్తుంటారని, ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో చాలా టెంట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఈ సమస్య ముగిసిపోతుందని అన్నారు.

ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. రైతులూ చాలా మంది వీక్షించారు. దీనికి ప్రతిస్పందనగానే నేడు ఎంపీ జంగ్రా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పెద్ద మొత్తంలో రైతులు కదిలివచ్చారు.

అంతేకాదు, మరో ప్రసంగంలో ప్రజలకు సూచనలు చేస్తూ ఆందోళనలకు వెళ్తున్న రైతుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారిని నిరసన బాట వీడేలా చేయాలని అన్నారు.

Also Read: Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో సుమారు ఏడాది కాలంగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య చర్చలు జరిగాయి. కానీ, అవి ఫలితాలను ఇవ్వలేదు. కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios