Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను సిట్ బృందం శనివారం నాడు అరెస్ట్ చేసింది. సిట్ ముందు ఆశిష్ మిశ్రా హాజరయ్యారు. రాత్రి పొద్దుపోయేవరకు ఆయనను సిట్ విచారించింది. ఆశిష్ మిశ్రా అరెస్ట్ విషయమై అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.

Lakhimpur Kheri violence: Union MoS Ajay Mishra's son arrested
Author
New Delhi, First Published Oct 10, 2021, 12:21 PM IST

లక్నో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు శనివారం నాడు అెస్ట్ చేశారు. Lakhimpur kheri లో  చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్  బృందం శనివారం నాడు ashish mishraను అరెస్ట్ చేసింది. ఆశిష్ మిశ్రా అరెస్ట్ కు సంబంధించి  పోలీస్ ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన చేయలేదు.

also read:కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిశోర్ వైరం? ఆయన ట్వీట్ ఏం చెబుతున్నది?

గత ఆదివారం నాడు లఖీంపూర్‌ఖేరీలో చోటు చేసుకొన్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆశిష్ మిశ్రాపై మరికొన్ని ఐపీసీ సెక్షన్లను నమోదు చేయాలని సిట్ జిల్లా పోలీసులకు సిఫారసు చేసిందని సమాచారం.

ఆరుగురు సభ్యుల sit బృందం ఆశిష్ మిశ్రాను శనివారం నాడు పొద్దుపోయేవరకు విచారించింది.లఖీంపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందానికి డీఐజీ నేతృత్వం వహిస్తున్నాడు. 

రైతులపై కారు దూసుకెళ్లిన సమయంలో తాను ఆ ప్రాంతంలో లేనని ఆశిష్ మిశ్రా 10 వీడియోలను  అఫిడవిట్లను సిట్ బృందానిి అందించాడు. అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీ లో  చోటు చేసుకొన్న హింసాకాండకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆశిష్ మిశ్రాకు రెండు దఫాలు సిట్ నోటీసులు పంపింది. దీంతో శనివారం నాడు ఉదయం 11 గంటలకు సిట్ ముందు ఆయన హాజరయ్యారు.

శనివారం నాడు ఉదయం ఉమ్మడి కిసాన్ మోర్చా సమావేశమైంది. new farm laws వ్యతిరేకంగా పోరాటంతో పాటు అక్టోబర్ 18న రైల్‌రోకో, అక్టోబర్ 26న మహాపంచాయత్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసే వరకు ఆందోళన చేయాలని సమావేశం తీర్మానించింది.

కేంద్ర మంత్రివర్గం నుండి అజయ్ మిశ్రాను తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ నెల 15వ తేదీన ప్రధాని, అమిత్ షాల దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని ఎస్‌కెఎం పిలుపునిచ్చింది.

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ తరుణంలో యూపీ సీఎం Yogi Adityanath స్పందించారు. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు.లఖీంపూర్ ఖేరీ ఘటనపై యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి Priyanka Gandhi Vadra  వారణాసిలో కిసాన్ న్యాయ్ ర్యాలీకి నాయకత్వం వహిస్తారు. ఈ నెల 11న  బంద్ కు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని shiv sena అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగానే ఈ బంద్ నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్, ఎన్సీపీల అధికార ప్రతినిధులతో కలిసి ఆయన మీడియా సమావేశలో పాల్గొన్నారు.


ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల సందర్భంగా 750 మంది రైతులు మరణించినందుకు గాను ప్రధాని  మోడీ పార్లమెంట్ లో సంతాపం తెలపాలని బికెయూ నేత రాకేష్ తికాయత్ కోరారు.లఖీంపూర్ ఖేరీ ఘటన నిందితులపై కేసు నమోదు చేయడానికి బదులుగా నిందితులకు ప్రభుత్వం బొకెలు ఇస్తోందని మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ కారును మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా నడిపినట్టుగా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే కారు తనదేనని ఆ కారును తన కొడుకు నడపలేదని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఇదివరకే స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios