ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ చేసిన ఆరోపణలపై క్షమాణలు చెప్పాలని బీజేపీ నేత కపిల్ మిశ్రా అన్నారు. క్షమాపణలు చెప్పకపోతే లై డిటెక్టర్ టెస్టుకు రావాలని సవాల్ విసిరారు. 

ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరాలని సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బీజేపీ నేత కపిల్ మిశ్రా మంగళవారం సవాల్ విసిరారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడైన సిసోడియా చేసిన ఆరోపణలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయని, ఆ వ్యాఖ్యలు ‘‘సిగ్గులేని’’ ప్రయత్నంగా చూడాలని అన్నారు. 

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. సిట్రాంగ్ తుఫాను అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ఐఎండీ.. ఒడిశా అప్ర‌మ‌త్తం !

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం తొమ్మిది గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న సిసోడియా.. తాను ఆప్‌ను విడిచిపెడితే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని దర్యాప్తు సంస్థ ఆఫర్ చేసిందని ఆరోపించారు. ‘‘ఆప్ నుండి వైదొలగాలని నాపై ఒత్తిడి వచ్చింది. నాకు ఢిల్లీ సిఎం పదవి ఇస్తామని అన్నారు. లేకపోతే జైలు శిక్ష పడుతుందని చెప్పారు. ’’ అని సిసోడియా అన్నారు. 

ఐఆర్సీటీసీ స్కామ్ లో తేజస్వీ యాదవ్ కు ఉపశమనం.. బెయిల్ రద్దుకు నిరాకరించిన సీబీఐ కోర్టు

ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ కపిల్ మిశ్రా మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. “నిజం తెలుసుకోవడానికి నార్కో లేదా లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవాలని నేను సిసోడియాకు సవాలు చేస్తున్నాను. లేకపోతే ఆయన సీబీఐకి వ్యతిరేకంగా చేసిన ప్రకటనను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పారు. ’’ అని ఆయన అన్నారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. సిసోడియా ఆరోపణలను సీబీఐ కూడా తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు ఖండించింది. ఎఫ్‌ఐఆర్‌లో అతడిపై వచ్చిన ఆరోపణల ప్రకారం సిసోడియాను వృత్తిపరమైన, చట్టపరమైన పద్ధతిలో ప్రశ్నించామని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు చట్టప్రకారం కొనసాగుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. 

కర్ణాటకలో మళ్లీ తెరపైకి హలాల్ అంశం.. పండగ సీజన్ లో ఆ మాంసాన్ని నిషేధించాలని హిందూ సంఘాల పిలుపు..

ఈ కేసులో 120బీ (క్రిమినల్ కుట్ర), 477 ఏ (రికార్డులను తారుమారు చేయడం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో సహా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలున్నాయంటూ సీబీఐ దర్యాప్తును లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేశారు. అయితే ఆప్ ప్రభుత్వం ఏ కారణం చూపకుండా ఈ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఆరోగ్యం, విద్య కోసం చేస్తున్నమంచి పనిని అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.