కర్ణాటకలో హిందూ సంస్థలు మరో సారి హలాల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ఈ పండగల సమయంలో హలాల్ మాంసాన్ని ఉపయోగించకూడదని రాష్ట్ర ప్రజలను కోరాయి. ఈ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తం అయ్యారు.
కర్ణాటకలో హలాల్ మాంసానికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించాయి. పండుగ సీజన్ కు ముందు అనేక హిందూ గ్రూపులు హలాల్ మాంసం ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజలను కోరుతూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టాయి. దీపావళి, ఇతర పండుగలలో హలాల్ కు వ్యతిరేకంగా ప్రచారం కొనసాగుతుందని హిందూ జన జాగృతి కమిటీ అధికార ప్రతినిధి మోహన్ గౌడ ప్రకటించారు.
అక్టోబర్ 23న ఆయోధ్యకు ప్రధాని మోడీ.. రామాలయ పనుల పరిశీలన
హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులు, మాంసానికి దూరంగా ఉండాలని హిందూ సమూహాలు కర్ణాటక వాసులకు పిలుపునిస్తున్నాయి. హిందూ జన జాగృతి కమిటీ అక్టోబర్ 16న హలాల్ వ్యతిరేక సదస్సును నిర్వహించింది. ఈ దీపావళి పండగ అంతటా హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరింది.
ఈ ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి, శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బజరంగ్ దళ్ హిందూ జనజాగృతి సమితి, శ్రీరామ సేన్, కొన్ని ఇతర మితవాద గ్రూపులు మాంసం దుకాణాల సైన్ బోర్డుల నుండి హలాల్ ధృవీకరణను తొలగించాలని కర్ణాటకలోని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
కేదార్‌నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
హలాల్ మాంసం ముస్లిం సమాజం ఆర్థిక జిహాద్ లో భాగమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. “హలాల్ ఒక ఆర్థిక జీహాద్. ముస్లింలు ఇతరులతో వ్యాపారం చేయకూడదని దీనిని జీహాద్ లాగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని విధించారు. హలాల్ మాంసాన్ని వాడాలని వారు భావిస్తున్నప్పుడు, దానిని ఉపయోగించకూడదని చెప్పడంలో తప్పేముంది’’ అని ఆయన అన్నారు.
'ప్రధాని రేపిస్టులతో ఉన్నారు'.. బిల్కిస్ బానో కేసు.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
హలాల్ మాంసంపై నిషేధం విధించాలని ఆయన వాధించారు. వాణిజ్య పద్ధతులకు వన్ వే రూల్ ఉండదని చెప్పారు. ‘‘ ముస్లింలు హలాల్ కాని మాంసం తినడానికి అంగీకరిస్తే.. వీరు (హిందువులు) కూడా హలాల్ మాంసాన్ని ఉపయోగిస్తారు’’ అని రవి తెలిపారు.
