ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ రద్దుకు నిరాకరించింది. 

ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు పెద్ద ఊరట లభించింది. బెయిల్‌ను రద్దు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ ను కూడా ధర్మాసనం మందలించింది. మాట్లాడేటప్పుడు ఆలోచనాత్మకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. బహిరంగంగా మాట్లాడే సమయంలో మంచి పదాలను ఎంచుకోవాలని చెప్పింది. 

ఫోన్ దొంగతనం చేశాడని.. పన్నెండేళ్ల చిన్నారిపై పైశాచితక్వం.. బావిలో వేలాడదీసి క్రూరత్వం...

ఐఆర్సీటీసీలో నిందితుడిగా ఉన్న తేజస్వి బెదిరింపులకు పాల్పడుతున్నారని, దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. తేజస్వి యాదవ్ ప్రభావవంతమైన స్థానంలో ఉన్నారని, ఆయన చేసే కామెంట్స్ దర్యాప్తును ప్రభావితం చేయగలవని పిటిషన్‌లో పేర్కొంది. 

వాస్తవానికి సీబీఐ రైడ్‌పై ఆగస్టు 25వ తేదీన తేజస్వీ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీబీఐపై పలు కామెంట్స్ చేశారు. దీంతో సెప్టెంబర్ 17న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తేజస్వి బెదిరింపులకు పాల్పడుతున్నారని, రాజ్యాంగాన్ని కించపరిచారని, దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఆయన న్యాయ ప్రక్రియను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, మొత్తం విచారణతో పాటు తదుపరి విచారణను అడ్డుకోవాలని చూశారని చెప్పింది. ‘‘ తనకు ఇచ్చిన స్వేచ్ఛను నిర్మొహమాటంగా దుర్వినియోగం చేశారని’’ సీబీఐ పేర్కొంది. దీనిపై నేడు కోర్టు వాదనలు వింది. 

కర్ణాటకలో మళ్లీ తెరపైకి హలాల్ అంశం.. పండగ సీజన్ లో ఆ మాంసాన్ని నిషేధించాలని హిందూ సంఘాల పిలుపు..

అయితే గతంలో తనకు మంజూరు చేసిన బెయిల్‌ షరతులను ఉల్లంఘించలేదని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ‘‘ నేను ప్రతిపక్షంలో ఉన్నాను. తప్పులపై ప్రశ్నలు లేవనెత్తడం నా కర్తవ్యం. సీబీఐ, ఈడీలను ప్రస్తుత ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలన్నీ దీనిని అనుభవిస్తున్నాయి’’ అని యాదవ్ తరుఫు న్యాయవ్యాది పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ ను రద్దు చేయడానికి నిరాకరించింది.

కేదార్‌నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

ఏమిటీ ఐఆర్సీటీసీ స్కామ్ ?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న (2004 నుంచి 2009) సమయంలో ఇది జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఐఆర్సీటీసీ రాంచీ, పూరీకి చెందిన రెండు హోటళ్లను ఒక ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఈ హోటళ్ల లీజుకు బదులు పాట్నాలోని బెయిలీ రోడ్డులో సుమారు మూడు ఎకరాల విలువైన భూమిని లాలూ కుటుంబం అందుకుందని ఆరోపణలు ఉన్నాయి. మొదట ఈ భూమిని డిలైట్ కంపెనీకి ఇచ్చి ఆ తర్వాత రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు చెందిన లారా ప్రాజెక్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు. రైల్వే హోటళ్ల లీజుకు బదులుగా డిలైట్ కంపెనీకి భూమిని ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. డిలైట్ కంపెనీ ఆర్జేడీ నాయకుడు ప్రేమ్‌చంద్ గుప్తా భార్యకు చెందినది. అయితే స్కామ్‌లో తేజస్వి యాదవ్, లాలూ యాదవ్, రబ్రీ దేవి, ఇతర నిందితులపై సీబీఐ కేసు 2017లో కేసు నమోదు చేసింది. తేజస్వి యాదవ్‌కు 2018లో బెయిల్ వచ్చింది.