అధికార ఎన్డీఏ తరుఫున రాష్ట్రప్రతి ఎన్నికల్లో బరిలో నిలిచిన ద్రౌపది ముర్మును గెలిపించడానికి బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ వ్యూహాన్ని అమలు చేస్తోందని ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. బుధవారం భోపాల్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘ఆపరేషన్ కమల్’ను నడుపుతోందని ప్రతిపక్షాల ఉమ్మ‌డి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తీవ్రంగా ఆరోపించారు. ఆ పార్టీ వ‌ద్ద ధనబలం ఆడుతోందంటూ పేర్కొంటూ, ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌపది ముర్మును గెలిపించ‌డానికి బీజేపీయేత‌ర ఎమ్మెల్యేలను తారుమారు చేస్తోందని సిన్హా ఆరోపించారు. ఎన్నిక‌ల్లో త‌న‌కు మద్దతు ఇవ్వాల‌ని కోరుతూ య‌శ్వంత్ సిన్హా గురువారం భోపాల్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌ల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు.

అనంత‌రం మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. “ కాంగ్రెస్‌కు చెందిన 28 గిరిజన ఎమ్మెల్యేలపై బీజేపీ కన్నేసిందని, క్రాస్ ఓటింగ్ కు ఓటింగ్‌కు సిద్ధమైంది’’ అని శీర్షికతో మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ వార్తాపత్రికలో ప్రచురించిన వార్తను తాను ఈ ఉదయం తీవ్ర బాధతో చదివానని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని బీజేపీయేతర ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున ముడుపులు అందజేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం అందిందని ఆరోపించారు.

22 ఏండ్లనాటి ఐటీ చట్టంలో అనేక లోపాలు.. సవరించాల్సిన సమయం వచ్చింది: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

ప్రజారాజ్యం అత్యున్నత పదవి ఎన్నికల్లోనూ ఇప్పుడు ‘ఆపరేషన్ కమల్’ అమలవుతున్నదని ఇది స్పష్టంగా తెలియజేస్తోందని సిన్హా అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని బీజేపీ భయపడుతున్నట్లు దీనిని బట్టి తెలుస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన గిరిజన ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి ఉమంగ్ సింఘార్ తనపై ఒత్తిడి తెచ్చారని ఒక సమావేశంలో స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. 

బీజేపీయేతర రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ ఆపరేషన్‌ కమల్ అమలు చేస్తోందని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో ఆరోపించాయని అన్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో వారి పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి బీజేపీయేతర ఎమ్మెల్యేలకు కూడా భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తాను విన్నానని సిన్హా ఆరోపించార‌ని పీటీఐ నివేదించింది. 

గతంలో తాను బీజేపీలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న బీజేపీకి చాలా తేడా ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా య‌శ్వంత్ సిన్హా చెప్పారు. “ రెండు పార్టీలు వేర్వేరు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ నేతృత్వంలోని బీజేపీ ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్క ఓటుతో ప‌డిపోయింది. ఇది చాలా గర్వకారణమైన అధ్యాయంగా నేను భావిస్తున్నాను. కేవలం ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని ఇప్పుడు ఊహించగలరా? ’’ అని ఆయన అన్నారు. ‘‘ విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తర్వాత మండీలో (మార్కెట్‌లో) సరుకులు అమ్ముతామని, కానీ మేము కొనలేదని వాజ్‌పేయి చెప్పిన సంగతి మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఈ రోజు ఉమంగ్ సింఘార్ జీ కొనుగోలు గురించి మాట్లాడారు. బీజేపీ ఎక్కడికి పోయింది? ’’ అని అన్నారు. 

వివాహిత తాళిని తీయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనం.. మద్రాస్ హై కోర్టు

ఓ సంద‌ర్భంలో య‌శ్వంత్ సిన్హా శ్రీలంక సంక్షోభంపై వ్యాఖ్యానించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక దారిలో వెళ్లదని అన్నారు. కానీ దేశం ఫారెక్స్ నిల్వలు చాలా వేగంగా క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. భారత రాష్ట్రపతి పదవికి జూలై 18న ఎన్నికలు జరగనున్నాయి. జూలై 21న ఓట్ల లెక్కింపు ఉండ‌నుంది.