Rajeev Chandrasekhar: భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ కోసం ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ గేమర్స్ హక్కులు, గోప్యత, భద్రతను పరిరక్షించడంతో పాటు ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరుస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 22 ఏండ్లనాటి ఐటీ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయనీ, నేడు దానిని సవరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 

separate framework for online gaming: కేంద్ర ప్ర‌భుత్వం ఆన్‌లైన్ గేమింగ్ కోసం ప్ర‌త్యేక ఫ్రేమ్ వ‌ర్క్ ను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ IT శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. కొత్త‌గా తీసుకురాబోయే ఈ ఫ్రేమ్ వ‌ర్క్ తో అనేక ఉప‌యోగాలున్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ కోసం ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ గేమర్స్ హక్కులు, గోప్యత, భద్రతను పరిరక్షించడంతో పాటు ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరుస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదే విష‌యం గురించి ఆయ‌న దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ కోసం ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్‌పై వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆన్‌లైన్ గేమర్‌ల బృందాన్ని కలుసుకున్నారు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ.. ఆన్‌లైన్ గేమర్స్ ముఖ్యమైన వాటాదారులుగా ఉన్నార‌ని తెలిపారు. ఆన్‌లైన్ గేమ్‌ల కోసం ప్రభుత్వం తుది ఫ్రేమ్‌వర్క్‌తో వచ్చినప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 

ప్రస్తుతం ఉన్న ఐటీ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని ఆయ‌న అన్నారు. ఇందులో లోపాలు ఉన్నాయ‌నీ, ఎందుకంటే దీనిని 22 ఏళ్ల క్రితం ఈ చట్టాన్ని రూపొందించారు.. ఆ స‌మ‌యంలో నేడు ఉన్న ఇంటర్నెట్ విప్ల‌వం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అన్ని విష‌యాలు గ‌మ‌నిస్తే మనకు కొత్త చట్టం (ఐటి లా మార్పు) అవసరమని తాను భావిస్తున్నాన‌ని చెప్పారు. 

Scroll to load tweet…

గ్లోబల్ స్థాయి సైబర్ చట్టాల తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ప్రధాని నరేంద్ర మోడీ జీ లక్ష్యంగా పెట్టుకున్న 1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీని చేరుకోవడం గురించి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గేమర్‌లను ముఖ్యమైన వాటాదారులుగా అభివర్ణించారు. ప్రభుత్వం ఆన్‌లైన్ గేమ్‌ల కోసం తుది ఫ్రేమ్‌వర్క్‌తో వచ్చినప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ కోసం ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ గేమర్స్ హక్కులు, గోప్యత మరియు భద్రతను పరిరక్షించడంతో పాటు ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరుస్తుందని ఆయన అన్నారు. సమావేశంలో పాల్గొన్న గేమర్‌లలో ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. గేమింగ్ కంటెంట్‌లో కొంత భాగాన్ని ప్రభుత్వం నియంత్రించాలనీ, కంటెంట్ మహిళలకు ఎటువంటి హాని కలిగించకుండా చూసుకోవాలని గేమర్‌లు సూచించార‌ని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో పాల్గొనాలనుకునే ఆటగాళ్ల అభ్యాసానికి ఆటంకం కలిగించే చదరంగం వంటి ఆన్‌లైన్ గేమ్‌లను కొన్ని రాష్ట్రాలు నిషేధించడాన్ని గేమర్స్ లేవనెత్తారు. ఆన్‌లైన్ గేమ్‌ల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌తో వచ్చినప్పుడు తమ హక్కులను పరిరక్షించాలనీ, స్వీయ-నియంత్రణ సంస్థలో వారికి చోటు కల్పించాలని గేమర్‌లు మంత్రిని కోరారు.

Scroll to load tweet…

ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన నిబంధనలపై పని చేయడానికి, ఈ రంగాన్ని చూసేందుకు నోడల్ మంత్రిత్వ శాఖను గుర్తించడానికి ప్రభుత్వం ఇంటర్-మినిస్ట్రీరియల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యుల ప్యానెల్‌లో ప్రభుత్వ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ CEO అలాగే హోం వ్యవహారాలు, రెవెన్యూ, పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యం, ఎలక్ట్రానిక్స్ మరియు IT, సమాచార అండ్ ప్రసార మరియు క్రీడల కార్యదర్శులు ఉన్నారు. ప్యానెల్ ఆన్‌లైన్ గేమింగ్, ఈ సెగ్మెంట్ కోసం ఫ్రేమ్ రెగ్యులేటరీ మెకానిజమ్‌లను ప్రోత్సహించడానికి, గేమర్‌ల రక్షణ, వ్యాపారాన్ని సులభంగా చేయడం వంటి అనేక అంశాలను పరిశీలిస్తోంది.