భర్తనుంచి విడిపోయిన ఓ మహిళ మెడలో తాళిని తీసి బ్యాంకు లాకర్లో పెట్టింది. ఇది భర్తను మానసిక హింసకు గురిచేయడమేనని తేల్చిన కోర్టు అతడికి విడాకులు మంజూరు చేసింది.
చెన్నై : భర్త నుంచి విడిపోయిన భార్య మంగళసూత్రంని తీసివేస్తే అది భర్తను మానసికంగా హింసకు గురిచేసినట్లేనని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు బాధిత వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. ఈరోడ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి శివకుమార్ సివిల్ ఇతర అప్పీలును అనుమతిస్తూ న్యాయమూర్తులు వీఎం వేలుమణి, ఎస్ సౌంథర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
శివకుమార్ తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ స్థానిక ఫ్యామిలీ కోర్టులో జూన్ 15, 2016 న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరాడు. ఈ కేసులో శివకుమార్ భార్య అయిన మహిళను విచారించినప్పుడు తాము విడిపోయేటప్పుడు మంగళసూత్రాన్ని తొలగించినట్లు అంగీకరించింది. అయితే, సూత్రాలు తీసివేయలేదని.. వాటి గొలుసును మాత్రమే తీసేసినట్టు వివరించింది. అయితే అలా ఎప్పుడు పడితే అప్పుడు తీసివేయడానికి లేదని దానికి కొన్ని పద్దతులు ఉన్నాయన్నారు.
ఆమె తరఫు న్యాయవాది మాట్లాడుతూ, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ను ప్రస్తావించారు. దీనిప్రకారం పెళ్లి అంటే తాళి కట్టడం అవసరం లేదని, అందుకే భార్య దానిని తొలగించినా వైవాహిక బంధంపై ఎలాంటి ప్రభావం చూపదని వాదించారు. అయితే, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వివాహానికి దానిదైన ప్రాముఖ్యత ఉంటుందని.. ఈ ప్రాంతంలో జరిగే వివాహ వేడుకలలో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని అందరికీ తెలిసిన విషయమని ధర్మాసనం ఎత్తి చూపింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 14 సార్లు బలవంతపు అబార్షన్.. మహిళ ఆత్మహత్య..
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను కూడా కోర్టు ఉటంకిస్తూ, "రికార్డులో లభ్యమైన మెటీరియల్‌ల ప్రకారం, పిటిషనర్ మంగళసూత్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. మెడలో నుంచి తీసి బ్యాంకు లాకర్‌లో పెట్టినట్టు ఆమె స్వయంగా అంగీకరించింది. హిందూ వివాహిత స్త్రీ తన భర్త జీవించి ఉన్నంతకాలం ఎలాంటి సమయంలోనైనా తాళిని తీసివేయదని తెలిసిన విషయమే.
"స్త్రీ మెడలో తాళి అనేది పవిత్రమైన విషయం, ఇది వైవాహిక జీవితం కొనసాగింపును సూచిస్తుంది. అది భర్త మరణించిన తర్వాత మాత్రమే తొలగించబడుతుంది. కాబట్టి, పిటిషనర్ / భార్య దానిని తొలగించడం మానసిక క్షోభను పెట్టే చర్యగా చెప్పవచ్చు. అత్యున్నత క్రూరత్వం బాధను కలిగించవచ్చు. ప్రతివాది మనోభావాలను దెబ్బతీస్తుంది, ”అని బెంచ్ పేర్కొంది.
అదే కొలమానాన్ని వర్తింపజేస్తూ, ప్రస్తుత బెంచ్ మంగళసూత్రాన్ని తీసివేయడం తరచుగా అనాలోచిత చర్యగా పరిగణించబడుతుంది. "వైవాహిక బంధాన్ని అంతం చేయడానికి మంగళసూత్రాన్ని తీసివేస్తే సరిపోతుందని మేము చెప్పడం లేదు. కానీ ప్రతివాది (భార్య) ఉద్దేశ్యాన్ని అంచనా వేయడానికి అది ఒక సాక్ష్యంగా ఉంది. విడిపోయిన సమయంలో తాళిని తొలగించడంలో ప్రతివాది చర్యతో పాటు రికార్డులో అందుబాటులో ఉన్న అనేక ఇతర ఆధారాలు, ఇరు పార్టీలకు రాజీపడి వివాహ బంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేదని ఖచ్చితమైన నిర్ధారణకు మమ్మల్ని వచ్చేలా చేస్తుందని’ బెంచ్ చెప్పింది.
అంతేకాకుండా, సహోద్యోగులు, విద్యార్థులు, పోలీసుల సమక్షంలో తన మహిళా సహోద్యోగులతో కలిసి ఆమె భర్తపై వివాహేతర సంబంధాల ఆరోపణలు చేశారని బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల నిర్ణయాల దృష్ట్యా.. భర్త తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ, వివాహేతర సంబంధం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా భార్య మానసికంగా హింసించిందని భావించేందుకు వెనుకాడేది లేదని న్యాయమూర్తులు తెలిపారు.
"అప్పీలుదారు మరియు అతని భార్య 2011 నుండి విడివిడిగా నివసిస్తున్నారని.. ఈ కాలంలో భార్య పునఃకలయిక కోసం ఎటువంటి ప్రయత్నం చేసినట్లు.. రికార్డులో ఎటువంటి ఆధారాలు లేవని అర్థం చేసుకున్నాం. అందువల్ల కేసులోని వాస్తవాలు, పరిస్థితులలో భార్య తన చర్య ద్వారా భర్తకు మానసిక క్రూరత్వం కలిగించిందని మాకు అనిపించిన దృష్ట్యా, 2008, నవంబర్‌లో జరిగిన పిటిషనర్, ప్రతివాది (భార్య) మధ్య వివాహాన్ని రద్దు చేస్తూ డిక్రీని మంజూరు చేయడం ద్వారా వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మేం ప్రతిపాదిస్తున్నాం" అని బెంచ్ పేర్కొంది, దిగువ కోర్టు ఆర్డర్‌ను పక్కన పెట్టి, పిటిషనర్‌కు విడాకులు మంజూరు చేసింది.
