సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి ఆజాం ఖాన్ కు జైలు శిక్ష ఖరారు అవడం, ఆయన శాసన సభ సభ్యత్వం తొలగిపోవడంపై ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే అధికార పార్టీ ఆయనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని ఆరోపించారు. 

సమాజ్ వాదీ సీనియర్ నేత ఆజంఖాన్ పై అనర్హత వేటు వేయడంపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. మతతత్వ శక్తులకు గట్టి ప్రత్యర్థి అయినందుకే తమ పార్టీ ఎమ్మెల్యేను తప్పుడు కేసులలో ఇరికించిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఆయన టార్గెట్ చేసిందని తెలిపారు.

యూనిఫాం సివిల్ కోడ్.. బీజేపీ స‌ర్కారుపై కేజ్రీవాల్ ఫైర్

2019 విద్వేషపూరిత ప్రసంగాల కేసులో రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష విధించిన మరుసటి రోజే ఖాన్ ను శాసనసభ నుంచి అనర్హులుగా ప్రకటిస్తూ శుక్రవారం నిర్ణయం వెలువడింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఆజంఖాన్ ను బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రతిరోజూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తోంది. ఖాన్ మతతత్వ శక్తులకు గట్టి ప్రత్యర్థి. ఆయన ప్రజాస్వామ్యం, సోషలిజానికి కట్టుబడి ఉన్నారు. అందుకే బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఆయన రాజ్యాంగం, లౌకికవాదం కోసం పోరాడిన నాయకుడు ’’ అని అఖిలేష్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టుగా ఉంది.. రాహుల్‌తో ఫొటోపై ట్రోలింగ్‌కు పూనమ్ కౌర్ కౌంటర్..

రాంపూర్, చుట్టు పక్కల జిల్లాల్లో యువతకు నాణ్యమైన విద్యను అందించడానికి ఆజాంఖాన్ ప్రయత్నించారని తెలిపారు. ‘ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన జౌహర్ యూనివర్సిటీని నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారు. మంత్రిగా, ఆజం ఖాన్ కుంభమేళాను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తరువాత కాలంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనానికి ఒక అంశంగా మారింది. అందులో ఆయన ప్రయత్నాలు ప్రశంసించబడ్డాయి. దీనిపై ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆజం ఖాన్ ను హార్డర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. ఇది బీజేపీకి మింగుడు పడలేదు ’’ అని ఆయన అన్నారు.

బీజేపీ టిక్కెట్ పై ఎన్నికల్లో పోటీ చేస్తానన్న కంగనా రనౌత్.. స్వాగతించిన జేపీ నడ్డా.. కానీ..

విద్యా సంస్థను నాశనం చేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని, అందుకే ఆజంఖాన్ పై తప్పుడు కేసులు బనాయించారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. విద్యావ్యవస్థలో నెలకొన్న అంతరాయంపై కాషాయ పార్టీని బహిర్గతం చేసే ఆయన వాస్తవ ఆధారిత ప్రశ్నలను అడ్డు తొలగించుకోవడానికే ఆజం ఖాన్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నారని తెలిపారు.

ఏడు నెలలుగా కోమాలోనే ఉన్న గర్భిణీ ప్రసవం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

కాగా.. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు కూడా ఇదే విధమైన భావాలను వ్యక్తం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాల కేసులో సమాజ్ వాదీ నేత ఆజంఖాన్ ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు వేయడం కక్షసాధింపు రాజకీయాలకు అద్దం పడుతోందని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ అన్నారు. మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్న శాసనసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వారు ప్రభుత్వ పదవులను సైతం అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు.