ప్రధాని నరేంద్ర మోడీపై, బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కుటిలత్వం ఇప్పుడు పాక్ జలసంధిని దాటి శ్రీలంకు చేరుకుందని అన్నారు. శ్రీలంక పవర్ విండ్ ప్రాజెక్ట్ ను అదానీ గ్రూప్ నకు దక్కేలా చేయాలని ప్రధాని ప్రయత్నించారని ఆపోపణలు రావడంతో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
శ్రీలంక పవర్ ప్రాజెక్టులో మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీపై మండిపడ్డారు.ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ‘‘బీజేపీ కుటిలత్వం ఇప్పుడు పాక్ జలసంధిని దాటి శ్రీలంకలోకి వెళ్లింది’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు.. గౌతమ్ అదానీ గ్రూప్‌నకు విండ్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పట్టుబట్టారని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తనతో చెప్పారని శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్ ఆరోపించిన నివేదికను ఆయన షేర్ చేశారు.
తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకపోయానని కుమారుడి ఆత్మహత్య.. ఎక్కడంటే ?
సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఛైర్మన్ MMC ఫెర్డినాండో శుక్రవారం నాడు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీ (COPE) ముందు ఆరోపణలు చేశాడు, అయితే అతడు కొంత సమయంలోనే తాను ఎమోషనల్ అయ్యానని చెప్పి వెంటనే వాటిని ఉపసంహరించుకున్నాడు. ప్రధాని మోడీపై తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొత్త ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో అతడి ఆరోపణలతో అధ్యక్షుడు రాజపక్సే ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేయవలసి వచ్చింది.
శ్రీలంక అధ్యక్షుడు ట్వీట్ చేస్తూ... ‘‘ మన్నార్‌లో విండ్ పవర్ ప్రాజెక్ట్ అవార్డుకు సంబంధించి COPE కమిటీ విచారణలో #lka CEB ఛైర్మన్ చేసిన ప్రకటనను పురస్కరించుకుని, ఈ ప్రాజెక్ట్‌ను ఏదైనా నిర్దిష్ట వ్యక్తికి లేదా సంస్థకు ప్రదానం చేసే అధికారాన్ని నేను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. ఈ విషయంలో బాధ్యతాయుతమైన కమ్యూనికేషన్ అనుసరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను ’’ అని అందులో పేర్కొన్నారు.
సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ.. సింధ్ నదిలో చిక్కుకున్న పౌరులను కాపాడిన సైనికులు
కాగా శ్రీలంక ప్రభుత్వం తన విద్యుత్ చట్టాన్ని సవరించిన కొన్ని రోజుల తరువాత ఈ వివాదం వచ్చింది, అక్కడ అది ఇంధన ప్రాజెక్టుల కోసం పోటీ బిడ్డింగ్ ను తొలగించింది. పార్లమెంటరీ చర్చలో ఈ చర్యను విమర్శించిన ప్రతిపక్ష శాసనసభ్యుడు నళిన్ బండారా, అదానీ గ్రూప్ వంటి ప్రాజెక్టులకు మార్గం సుగమం చేయడానికి పోటీ బిడ్డింగ్ ను తలొగిస్తున్నారని అన్నారు.
కాగా లడఖ్ సరిహద్దులో చైనా వంతెన నిర్మించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. ‘‘ భవిష్యత్ శత్రు చర్యకు చైనా పునాది నిర్మిస్తోంది. దీనిని విస్మరించి బీజేపీ కేంద్ర ప్రభుత్వం భారతదేశానికి ద్రోహం చేస్తోంది’’ అని పేర్కొన్నారు.
‘‘ఒక మహిళపై ద్వేషం.. లౌకిక ఉదారవాదుల మౌనం’’ - గౌతమ్ గంభీర్.. నూపుర్ శర్మకు మద్దతు
లడఖ్‌లో చైనా అతిక్రమణలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పోల్చడం నుండి దేశాన్ని రక్షించమని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పడం వరకు, రాహుల్ గాంధీ భారతదేశ చైనా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత చర్చలకు సాధ్యం కాదని, తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సోపై చైనా రెండవ వంతెనను నిర్మిస్తున్నట్లు వచ్చిన నివేదికలపై ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
