Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ శాసనసభ్యులతో వేదిక పంచుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు.. స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

Gandhinagar: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా తేలిన రేపిస్టులు తాజాగా బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి వేదికను పంచుకున్నారు. ఇటీవ‌ల‌ బానోపై సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది.
 

Bilkis Bano gangrape convicts share stage with BJP legislators RMA
Author
First Published Mar 27, 2023, 12:39 PM IST

Bilkis Bano gang rape case: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా తేలిన రేపిస్టులు తాజాగా బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి వేదికను పంచుకున్నారు. ఇటీవ‌ల‌ బానోపై సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది.

వివ‌రాల్లోకెళ్తే.. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషుల తేలిన 11 మందికి ఉపశమనం క‌ల్పిస్తూ గుజ‌రాత్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జ‌ర‌ప‌డానికి ముందు, గుజ‌రాత్ లోని దాహోడ్ లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభ్యులతో క‌లిసి గ్యాంగ్ రేప్ దోషులు వేదికను పంచుకున్నారు. అల్లర్ల సమయంలో బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషుల ప‌ట్ల బీజేపీ స‌ర్కారును వైఖ‌రిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీ శాస‌న స‌భ్యులు దోషుల‌తో వేదిక‌ను పంచుకుని క‌నిపించ‌డం పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

అల్లర్ల సమయంలో హింస నుంచి తప్పించుకునే క్రమంలో సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బానో వయసు 21, ఐదు నెలల గర్భవతి. మృతుల్లో ఆమె మూడేళ్ల కూతురు కూడా ఉంది. 11 మంది దోషుల్లో ఒకరైన శైలేష్ భట్ శనివారం దాహోద్లో నీటి సరఫరా పథకాన్ని ప్రారంభ కార్య‌క్ర‌మానికి బీజేపీ దహోడ్‌ ఎంపీ జస్వంత్‌ సిన్హ్‌ భభోర్‌, లింఖేడా ఎంఎల్‌ఏ శైలేశ్‌ భభోర్‌ హాజరయ్యారు. అయితే, రేపిస్ట్ ను సైతం త‌మ‌తో కూర్చోపెట్టుకుని ఉన్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకోవ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఈ కార్యక్రమానికి భట్ హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  భారతదేశం తన నైతిక దిక్సూచిని తిరిగి పొందాలని తాను కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.  మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డిన ఆ దోషుల‌ను తిరిగి జైళ్లో చూడాల‌ని పేర్కొంటున్నట్టు తెలిపారు. న్యాయాన్ని అపహాస్యం చేస్తున్న ఈ పైశాచిక ప్రభుత్వానికి  బుద్ది చెప్పాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

 

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప‌క్క‌న కూర్చోబెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారని తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ శాసనసభ్యురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శిరోమణి అకాలీదళ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ రేపిస్టుకు గౌరవప్రదమైన స్థానం కల్పించడం, పునరావాసం కల్పించడం ఏ రాజకీయ పార్టీకైనా, ముఖ్యంగా అధికార బీజేపీకి గర్హనీయమన్నారు. ఈ పార్టీకి రాజకీయాలు మహిళల గౌరవానికి అతీతమైనవని, మహిళలను గౌరవించే మాటలన్నీ కేవలం నినాదాలే తప్ప మరేమీ కాదని ఆమె ట్వీట్ చేశారు. 

ఆగస్టు 15న జైలు నుంచి బయటకు వచ్చిన దోషులకు పూలమాలలు వేసి మిఠాయిలు తినిపించారు. వారు మంచి విలువలు కలిగిన బ్రాహ్మణులని అధికార బీజేపీ శాసనసభ్యుడు సీకే రౌల్జీ వారి విడుదలను సమర్థించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios