Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్ రేప్ నిందితుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ 

బిల్కిస్ బానో కేసు: సామూహిక అత్యాచారం కేసులో 11 మంది ఖైదీలను బిజెపి నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్షతో ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుండి విడుదల చేసింది. దోషుల విడుదలకు వ్యతిరేకంగా బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.  
 

Bilkis Bano Challenges In Supreme Court Release Of Her Rapists
Author
First Published Nov 30, 2022, 4:23 PM IST

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు: 2002 గుజరాత్ అల్లర్లల్లో తనపై సామూహిక అత్యాచారం చేసి, తన కుటుంబాన్ని హతమార్చిన 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పునఃపరిశీలించాలని బిల్కిస్ డిమాండ్ చేశారు. ఇటీవల బిల్కీస్‌పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితులను విడుదల చేశారు. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖాలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ధర్మాసనం హామీ ఇచ్చారు. గత రిమిషన్ పాలసీ ప్రకారం గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున దోషులను విడుదల చేసింది. ఈ చర్య దేశవ్యాప్తంగా పెద్ద ఆగ్రహాన్ని రేకెత్తించింది, ప్రత్యేకించి రేపిస్టులను ఒక హిందూ సంస్థ ద్వారా పూలమాలలు వేసి హీరోలుగా స్వాగతించింది.  

దోషుల్లో ఒకరి పిటిషన్‌ ను సుప్రీం కోర్టు విచారిస్తూ.. 1992 రిమిషన్ పాలసీ ప్రకారం గుజరాత్ ప్రభుత్వం అతనిని విడుదల చేయడాన్ని పరిగణించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ తీర్పు ఆధారంగా గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మందిని విడుదల చేసింది. కేంద్రం కూడా విడుదలను వేగవంతం చేసింది, రెండు వారాల్లో గుజరాత్ చర్యను క్లియర్ చేసింది. ఈ  అత్యాచారం, హత్య దోషుల విడుదలకు 2014లో రూపొందించిన కఠినమైన నిబంధనలు విడుదలకు వర్తించవని పేర్కొంది. 

మే 13న..సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ షా పిటిషన్‌పై తీర్పును వెలువరిస్తూ..2008లో శిక్షకు గురైనట్లు పేర్కొంది. కాబట్టి గుజరాత్‌లో 2014లో రూపొందించిన కఠినమైన నిబంధనలు విడుదలకు వర్తించవు, కానీ 1992 నిబంధనలు వర్తిస్తాయి. దీని ఆధారంగా 14 ఏళ్ల శిక్ష పడిన 11 మందిని ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. 1992 నియమాలలో.. 14 సంవత్సరాల తర్వాత జీవిత ఖైదు విధించబడిన ఖైదీల విడుదల గురించి మాట్లాడబడింది, అయితే 2014 లో అమలు చేయబడిన కొత్త నిబంధనలలో, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి ఈ మినహాయింపును కోల్పోయారు.
 
ఆర్డర్ ఉపసంహరణ కోసం అభ్యర్థన
 
బిల్కిస్ బానో తరపున దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లో.. నిందితుల విడుదలను వ్యతిరేకించారు. మరోసారి తీర్పును పునర్ సమీక్షించాలని వేడుకున్నారు. ఇప్పటివరకు నిందితుల విడుదలను వ్యతిరేకిస్తూ..  సుభాషిణి అలీ, రూపరేఖ వర్మ, మహువా మోయిత్రా సహా పలువురు నాయకులు,సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను వారు సవాలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిల్కిస్ బానో స్వయంగా కోర్టుకు వచ్చి మే 13న వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
 
2002 లో ఏం జరిగింది? 
 
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో దాహోద్ జిల్లాలోని రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన బిల్కిస్ తన కుటుంబంలోని 16 మంది సభ్యులతో కలిసి పారిపోయి సమీపంలోని ఛపర్వాడ్ గ్రామ పొలాల్లో తలదాచుకుంది. మార్చి 3, 2002న .. 20 మందికి పైగా అల్లరిమూకలు వారి దగ్గరకు చేరుకుని   దాడి చేశారు. 5 నెలల గర్భిణి అయిన బిల్కిస్‌తో సహా మరికొందరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది మాత్రమే కాదు..  బిల్కిస్ 3 సంవత్సరాల కుమార్తెతో సహా 7 మందిని హత్య చేశారు.  
 
2008లో జీవిత ఖైదు
 
బాధితురాలిపై ఒత్తిడి తేవాలని నిందితుల నుంచి ఫిర్యాదు అందుకున్న సుప్రీంకోర్టు కేసును మహారాష్ట్రకు బదిలీ చేసింది. 2008 జనవరి 21న ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధించింది. 2017లో బాంబే హైకోర్టు శిక్షను సమర్థించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios