Asianet News TeluguAsianet News Telugu

బీహార్ పూర్తి అయ్యింది.. ఇక కేంద్రమే త‌రువాయి - ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్

బీహార్ రాజకీయ పరిణామాలు ఒక్క సారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నాయకుడు, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తన పార్టీ నాయకులతో మాట్లాడారు. బీహార్ లో అధికారం నుంచి బీజేపీని తొలగించామని, ఇక కేంద్రం నుంచి కూడా తొలగిస్తామని అన్నారు. 

Bihar is done.. Center is next - RJD leader Tejaswi Yadav
Author
Patna, First Published Aug 9, 2022, 4:16 PM IST

బీహార్ లో అధికారం నుంచి బీజేపీ వైదొలింగ‌ద‌ని, ఇక కేంద్రం నుంచి ఆ పార్టీని తొల‌గిస్తామ‌ని ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ అన్నారు. నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని అన్నారు. అదే త‌మ మొద‌టి ప్రాధాన్య‌త అని చెప్పారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను లాలూ ప్రసాద్ నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 

లాలూ లేకుంటే బిహార్ నడవదు.. పట్టాభిషేకానికి సిద్దం: బిహార్‌లో భారీ రాజకీయ మార్పుపై లాలూ కూతురు సిగ్నల్..

బీహార్ లో రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క సారిగా మారిపోయాయి. గ‌త రెండు మూడు రోజుల నుంచి కూట‌మిలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బీహార్ లో జేడీ(యూ), బీజేపీ క‌లిసి ఎన్డీఏ కూట‌మిగా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ రెండు పార్టీల మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం నితీష్ కుమార్ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో నితీష్ కుమార్ ఇక బీజేపీతో విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని స‌మ‌చారం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఎప్పుడూ ఆయన వెంటే ఉంటామని నాయ‌కులు చెప్పిన‌ట్టు ప‌లు వార్త సంస్థ‌లు నివేదించాయి. 

Bihar Political Crisis: బీజేపీతో జేడీయూ కటీఫ్.. 4 గంటలకు గవర్నర్ వద్దకు తేజస్వీతో నితీష్ కుమార్!

లాలూ ప్ర‌సాద్ కు చెందిన ఆర్జేడీతో క‌లిసి కొత్తగా జేడీ(యూ) ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు అర్థం అవుతోంది. ఇదే స‌మంయ‌లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తమ మద్దతు తెలుపుతూ లేఖను తేజస్వీ యాదవ్‌కు అందించారు. తేజస్వీ యాదవ్ కూడా తమ మొత్తం మద్దతును తెలియజేస్తూ నితీష్ కుమార్‌కు లేఖ అందించినట్టు తెలిసింది. తేజస్వీ యాదవ్‌తో కలిసి గవర్నర్‌ను కలవడానికి సీఎం నితీష్ కుమార్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. తరువాత వీరంతా కలిసి మ‌రో స‌మావేశాన్ని నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆ తర్వాతే స్పష్టమైన వివరాలు బయటకు రానున్నాయి.

ప్ర‌జ‌లకు నీరు, ర‌వాణా, విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించ‌డం ‘ఉచితాలు’ కాదు - సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ

జేడీ(యూ) నాయకుల‌తో జ‌రిగిన స‌మావేశంలో 2020 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీహార్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తాన‌ని సీఎం నితీష్ కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. అయితే ఆ స‌మ‌యం నాటికి బీజేపీతో తెగ‌దింపులు చేసుకోవ‌డంపై, అలాగే ఆర్జేడీతో క‌ల‌వ‌డం వంటి విష‌యాల‌పై ఆయ‌న స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios