ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందించడం ఉచిత పథకాల కిందకు రాదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. తన సంక్షేమ పథకాల అమలు తీరును సుప్రీంకోర్టులో సమర్థించుకుంది. 

ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత ప‌థ‌కాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉచిత నీరు, విద్యుత్, రవాణా వంటి హామీలు ‘ఉచితాలు’ కాదని పేర్కొంది. అసమాన సమాజంలో అవసరమైన నిబంధనలు అని ఆప్ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఉచితాలు ఇస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్ప‌టికే దంచికొడుతున్న వాన‌లు.. మ‌రో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు: ఐఎండీ హెచ్చ‌రిక‌లు

ఈ పిల్ పై ఆప్ స్పందిస్తూ.. ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఈ పిల్ ను ఉప‌యోగించుకోవడానికి అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్ ద్వారా ప్రయత్నిస్తున్నారని ఆప్ దరఖాస్తులో ఆరోపించింది. పిటిషనర్ ఒక నిర్దిష్ట పార్టీతో తన ప్రస్తుత లేదా గత సంబంధాలను బహిర్గతం చేయ‌కుండా తన పిటిషన్ లో త‌న‌ను తాను ‘సామాజిక-రాజకీయ కార్యకర్త’ అని పేర్కొన్నారని ఆప్ ఆరోపించింది.

‘‘ ప్రస్తుత పిటిషన్ సాధారణ ప్రజాప్రయోజనాల కోసం చేసిన పక్షపాత వ్యాజ్యానికి ఉదాహరణ కాదని, వ్యక్తిగత లేదా రాజకీయ ఉద్దేశాలను విస్మరించిందని దరఖాస్తుదారుడు గౌరవంగా సమర్పించారు. పిటిషనర్ కు అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో బలమైన సంబంధాలు ఉన్నాయి, గతంలో దాని ప్రతినిధిగా, ఆ పార్టీ ఢిల్లీ యూనిట్ నాయకుడిగా పనిచేశారు. ప్రజాప్రయోజనాల పేరుతో పిటిషనర్ దాఖలు చేసిన పనికిమాలిన పిటిషన్లు, తరచుగా ఈ పార్టీ రాజకీయ ఎజెండా నుంచి ప్రేర‌ణ పొందుతున్నాయి. గతంలో ఈ కోర్టు విమర్శల కిందకు కూడా వచ్చాయి ’’ అని ఆప్ త‌న ద‌ర‌ఖాస్తులో పేర్కొంది. 

అశ్వినీ ఉపాధ్యాయ్ తన పిటిషన్ ‘ఉచితాల’ ను ప్రస్తావిస్తూ, ప్రజా సంక్షేమ చర్యలను లక్ష్యంగా చేసుకుంటూ, ఒక నిర్దిష్ట ఆర్థిక అభివృద్ధి నమూనాపై న్యాయపరమైన చర్యలను కోరుతున్నట్లు కూడా ఉంద‌ని తాము గుర్తించామ‌ని ఆప్ తెలిపింది.

వివాహేతర సంబంధం :పెళ్లి చేసుకోనన్నాడని.. ప్రియుడ్ని చంపి, సూట్ కేస్ లో కుక్కి..

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ‘ఉచితాలు’ అంశంపై ‘తీవ్రమైన’ అంశంపై మేధోమథనం చేయాలని ఆగస్టు 3 న సుప్రీం కోర్టు కేంద్రాన్ని, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐని కోరింది. దీనిని పరిష్కరించడానికి తగిన సూచనలతో ముందుకు రావాలని కోరింది, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స‌మ‌స్య‌ను పార్లమెంటులో వ్యతిరేకించ‌డానికి, చ‌ర్చిండానికి ఇష్ట‌ప‌డ‌దు అని తెలిపింది.

జిల్లా స్థాయిలో మైనార్టీలని గురించే ఆదేశాలు జారీ చేయలేం: సుప్రీంకోర్టు

కాగా.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఉచిత ప‌థ‌కాల‌పై చాలా కాలం నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పలు పార్టీలు కూడా దీనిని వ్య‌తిరేకిస్తున్నాయి. అయితే తాము ఎక్క‌డా దుబారా ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, ప్ర‌జ‌లకు అవ‌స‌ర‌మైన వాటిని మాత్ర‌మే ఉచితంగా అందిస్తున్నామ‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప‌లు సంద‌ర్భాల్లో చెబుతున్నారు. త‌మ ప్ర‌భుత్వం అవినీతిని అరిక‌ట్టింద‌ని, అలాగే ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు అందే ఉచిత సౌక‌ర్యాల‌ను కోత పెట్టి సామాన్యుల‌కు ఆ నిధుల‌తో సౌక‌ర్యాల‌కు క‌ల్పిస్తున్నామ‌ని ఆప్ ప్ర‌భుత్వ విధానాల‌ను కేజ్రీవాల్ స‌మ‌ర్థించుకున్నారు.