Asianet News TeluguAsianet News Telugu

లాలూ లేకుంటే బిహార్ నడవదు.. పట్టాభిషేకానికి సిద్దం: బిహార్‌లో భారీ రాజకీయ మార్పుపై లాలూ కూతురు సిగ్నల్..

బిహార్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలని పార్టీ నేతల సమావేశంలో జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టాభిషేకానికి సిద్దం అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి బిహార్‌‌ ఏం జరగబోతుందో సంకేతాలు ఇచ్చేశారు.

Lalu Prasad yadav Daughter Rohini Makes Coronation Claim
Author
First Published Aug 9, 2022, 3:15 PM IST

బిహార్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలని పార్టీ నేతల సమావేశంలో జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి నితీశ్ కుమార్.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘పట్టాభిషేకానికి సిద్ధం చేయండి, లాంతరు వాహకాలు వస్తున్నాయి’’ అని రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు. ఆర్జేడీ పార్టీ గుర్తు.. లాంతర్ అన్న సంగతి తెలిసిందే. 

ఈ సందర్బంగా ‘‘లాలూ బిన్ చాలూ ఈ బిహార్ నా హోయీ (లాలూ లేకుండా బీహార్ నడపబడదు)’’ భోజపురి సాంగ్‌ను షేర్ చేసిన రోహిణి ఆచార్య.. ఆర్జేడీ ప్రభుత్వంలో భాగం కాబోతుందనే సంకేతాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఆర్జేడీకి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలసిందే. ఇక, దాణా కుంభకోణంలో పలు కేసుల్లో దోషిగా తేలిన లాలూ యాదవ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

 

ఇక, తేజస్వీ యాదవ్ ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఉన్న సంగతి తెలిసిందే. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో.. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా, తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. లాలూ యాదవ్ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ సమయంలో మంత్రిగా ఉన్నారు. అయితే 2017లో ఆ కూటమికి గుడ్ బై చెప్పిన నితీశ్ కుమార్.. బీజేపీతో జట్టు కట్టారు. ఇక, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. అధికారం చేపట్టేందుకు ఆ కూటమికి సరిపడ మెజారిటీ లేకపోవడంతో అధికారానికి దూరంగా ఉండిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios