Asianet News TeluguAsianet News Telugu

Booster Doseగా భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా.. ఎస్ఈసీ పరిశీలన...

‘omicron’ కేసులు విస్తురిస్తోన్న నేపత్యంలో ‘బూస్టర్ డోసు’ మీద ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింద. దాదాపు 5,000మంది  వాలంటీర్ల మీద ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

Bharat Biotech Nasal Drops Vaccine as Booster Dose, SEC observation
Author
Hyderabad, First Published Jan 5, 2022, 8:42 AM IST

ఢిల్లీ : Bharat Biotech International అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (Nasal vaccine) ‘బూస్టర్ డోసు’ కింద వినియోగించేందుకు అవనరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని  DCGIకి (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) చెందిన సబ్జెక్టు నిపుణఉల కమిటీ (ఎస్ఈసీ) పరిశీలిస్తోంది. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారికి ‘Booster Dose’ కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్ బయోటెక్ పేర్కొంది.

‘omicron’ కేసులు విస్తురిస్తోన్న నేపత్యంలో ‘బూస్టర్ డోసు’ మీద ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింద. దాదాపు 5,000మంది  వాలంటీర్ల మీద ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

ఇందులో సగం మందిని కొవాగ్జిన్, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న తరువాత 6నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్ డోసు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా చుక్కల మందు టీకా మీద క్లినికల్ పరీక్షలను నిర్వహించి, త్వరగా చుక్కల మందు టీకాను అందుబాటులోకి తీసుకురావాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫారసు, డీసీజీఐ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. 

టీనేజర్లకు అనుమతి లేని వ్యాక్సిన్ ఇచ్చిన ఆరోగ్య సిబ్బంది.. బీహార్ లో ఘటన..

ఇదిలా ఉండగా, టీనేజ్ పిల్ల‌ల‌కు పెద్ద‌ల మాదిరిగా కోవిషీల్డ్ ఇత‌ర వ్యాక్సిన్లు కాకుండా కేవ‌లం కోవాగ్జిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. పిల్ల‌ల‌కు కోవాగ్జిన్ మాత్ర‌మే ఇవ్వ‌డానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు పిల్ల‌ల‌కు అదే వ్యాక్సిన్ వేస్తున్నాయి. అయితే బీహార్‌లో మాత్రం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు పొర‌పాటున కోవాగ్జిన్ కు బ‌దులుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. త‌రువాత జ‌రిగిన పొర‌పాటును గుర్తించారు. దీంతో త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ష‌రీఫ్ ప్రాంతంలోని ఫ్రొఫెస‌ర్ కాల‌నీకి చెందిన పీయూష్ రంజ‌న్ కు ఇద్ద‌రు పిల్ల‌లు. అందులో ఒక‌రు ఆర్య‌న్, మ‌రొక‌రు కిర‌ణ్‌. పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయించేందుకు తండ్రి పీయూష్ ముందుగానే రిజిస్ట్రేష‌న్ చేసుకున్నాడు. వ్యాక్సినేష‌న్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించాడు. అయితే అక్క‌డి ఆరోగ్య సిబ్బంది పిల్ల‌ల‌కు కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంద‌జేశారు. నిజానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ పిల్ల‌ల‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌లేదు. అందుకే పిల్ల‌లపై క్లినిక‌ల్ ట్ర‌యల్స్ నిర్వ‌హించిన కోవాగ్జిన్ అందించాల‌ని డీసీజీఐ నిర్ణ‌యించింది.

ఈ ఘ‌ట‌న‌పై తల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు త‌ల్లిదండ్రులు ప్ర‌య‌త్నించారు. దీంతో పిల్ల‌లిద్దరిని కొన్ని గంట‌ల పాటు డాక్ట‌ర్ల పరిశీల‌న‌లో ఉంచారు. టీకా వేసే వ్య‌క్తికి క‌రోనా సోక‌డంతో అత‌డు సెల‌వులో ఉన్నాడని, కొత్త సిబ్బంది పొర‌పాటున కోవిషీల్డ్ వేశార‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. పిల్ల‌ల‌కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య త‌లెత్తినా ప్ర‌భుత్వమే పూర్తి చికిత్స అందిస్తుంద‌ని వారు హామీ ఇచ్చారు. అయితే పిల్ల‌ల‌కు కోవిషీల్డ్ టీకా ఇచ్చిన‌ప్ప‌టికీ వారికి వ‌చ్చిన క‌రోనా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ లో మాత్రం కోవాగ్జిన్ అందిచ‌న‌ట్టు న‌మోదు అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios