కోల్‌కత్తా: విభిన్నంగా ఆలోచించి ఓ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్‌ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఓ మోడల్‌ను నగ్నంగా పెళ్లి కూతురి మాదిరిగా ముస్తాబు చేసి ఫోటో తీసిన ఫోటో గ్రాఫర్ ప్రీతమ్ మిత్రా ప్రాణాల మీదికి తెచ్చింది. సృజనాత్మకత పేరుతో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.దీంతో ప్రీతమ్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి.

బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రీతమ్ మిత్రా అనే ఫోటో గ్రాఫర్ పెళ్లి కూతురులా నుదుట బొట్టు పెట్టి ఓ మోడల్‌ను నగ్నంగా ఫోటోలు తీశారు. మోడల్ తలపై బెంగాల్ రాష్ట్రంలో పెళ్లి కూతురు దరించేలా కిరీటాన్ని దరింపజేశాడు.

మరో వైపు ఓ చేతిలో తమలపాకులతో ముఖాన్ని... మరో చేత్తో ప్రైవేట్ భాగాలు కన్పించకుండా కుంకుమభరణి అడ్డుపెట్టాడు.ఈ ఫోటోను తీశాడు. ఈ ఫోటోను  తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. 

సంప్రదాయాలను, మత గౌరవాలను దెబ్బతీశావంటూ ప్రీతమ్‌కు బెదిరింపులు ప్రారంభమయ్యాయి.  ఫోటోను తొలగించకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ప్రీతమ్ కు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. 24 గంటల్లోపుగా ఫోటోను తొలగించాలని హెచ్చరించారు.. దీంతో ప్రీతమ్ పోలీసులను ఆశ్రయించాడు.