అజిత్ పవార్ కు ఎదురుదెబ్బ.. శరద్ పవార్ వర్గానికి తిరిగొచ్చిన మరో ఎన్సీపీ ఎమ్మెల్యే..

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్సీపీలో చెలరేగిన అంతర్గత తిరుగుబాటు కారణంగా రాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా తిరుగుబాటు వర్గంలో ఉన్న ఓ ఎమ్మెల్యే శరద్ పవార్ వర్గంలో చేరడం చర్చనీయాంశం అయ్యింది. 

Backlash to Ajit Pawar.. Another NCP MLA who returned to Sharad Pawar faction..ISR

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కల్లోలం ఇంకా కొలిక్కి రాలేదు. మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరేందుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఎమ్మెల్యేలు రెండు వర్గాల మధ్య అటూ ఇటూ తిరుగుతున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నేత అజత్ పవార్ ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే ఎన్నికల సంఘం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు.

ఘోరం.. ట్యూషన్ కు వచ్చిన పదేళ్ల బాలికపై 30 ఏళ్ల టీచర్ అత్యాచారం..

తాజాగా ఎన్సీపీలో మరో పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే పవార్ వర్గంలోకి వెళ్లిపోయారు. గడిచిన వారం రోజుల్లో అజిత్ పవార్ ను వీడిన మూడో ఎమ్మెల్యే మక్రాంద్ జాదవ్ పాటిల్ కావడం గమనార్హం. ఆయన కంటే ముందు రాంరాజే నాయక్-నింబాల్కర్, దీపక్ చవాన్ తిరిగి శరద్ పవార్ శిబిరానికి చేరుకున్నారని ‘జీ న్యూస్’ నివేదించింది.

కెమెరాలు వెంట పెట్టుకొని వరి నాట్లు వేసిన మొదటి రైతు రాహుల్ గాంధీ - బీజేపీ

మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వై అసెంబ్లీ స్థానం నుంచి మక్రాంద్ జాదవ్ పాటిల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వందలాది మంది మకరంద్ మద్దతుదారులు కూడా ఆయన బాటలోనే శరద్ శిబిరానికి చేరుకున్నారు. మరోవైపు శరద్ పవార్ వర్గానికి చెందిన కిరణ్ లహమాటే అజిత్ శిబిరంలోకి మారారు. మొదట ఆయనతో అజిత్ తోనే వెళ్లారు. ఆ తరువాత శరద్ పవార్ శిబిరానికి వెళ్లి.. మళ్లీ అజిత్ వర్గంలో చేరారు. జూలై 2న అజిత్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన అక్కడే ఉన్నారు.

అజిత్ శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు శరద్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ మధ్య పోరాటం ప్రారంభమైంది. జూలై 5న ఇరువర్గాలు సమావేశమై తమ బలాన్ని చాటుకున్నాయి. అజిత్ వర్గం భేటీలో 35 మందికి పైగా ఎమ్మెల్యేలు, శరద్ వర్గానికి 15 మంది ఎమ్మెల్యేలు వచ్చారని ప్రచారం జరిగింది.

జమ్మూకాశ్మీర్ లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రత నమోదు

అయితే అజిత్ మాత్రం తనకు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పార్టీని నియంత్రించడానికి అజిత్ పవార్ కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా తమదేనని పేర్కొంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి కోసం కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios