Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామ మందిరం: ఉజ్జయిని శివుడి ఆలయంలో భస్మహారతి


అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని  ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో  భస్మ హరతిని నిర్వహించారు.
 

Ayodhya Ram Mandir Inauguration: Special Bhasma Aarti performed at Mahakaleshwar Temple in Ujjain lns
Author
First Published Jan 22, 2024, 12:16 PM IST | Last Updated Jan 22, 2024, 12:16 PM IST

న్యూఢిల్లీ: అయోధ్యలోని రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక భస్మహారతిని సోమవారంనాడు నిర్వహించారు.  అంతేకాదు ఆలయంలో వేడుకలు నిర్వహించారు.

భస్మ హారతి ఈ ఆలయంలో ప్రసిద్ద ఆచారం. ఉదయం 03:30 నుండి 05:30 గంటల మధ్య బ్రహ్మ ముహుర్తం సమయంలో  ఇస్తారు.  భస్మా హరతిలో పాల్గొనే భక్తుల కోరికలు నెరవేరుతాయని  చెబుతారు.

ఇవాళ ఉదయం భస్మ హరతిని పురస్కరించుకొని  శివుడి సమీపంలో  రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల విగ్రహాలను ఉంచి హరతి ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు బాణసంచాల కాల్చి పూల వర్షం కురిపించారు. 

also read:రామ్ లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు

ఆలయ పూజారి ఆశిష్ శర్మ మాట్లాడుతూ  భస్మ హారతి సందర్భంగా బాబా మహాకాళ మహాపూజ నిర్వహించినట్టుగా చెప్పారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె కలిపి పంచామృతంతో  మహాకాళస్వామికి పుణ్యస్నానం చేశామన్నారు. బాబా మహాకాల్ ముందు రామ్ దర్బార్ ఉందని ఆయన వివరించారు. 

also read:అయోధ్య రామ మందిరం: అమెరికా టైమ్స్ స్క్వేర్ లో స్క్రీన్లపై రాముడి ఫోటోలు, ఎన్ఆర్ఐల సంబరాలు

అయోధ్య నుండి రాముడు తన స్నేహితుడైన బాబా మహాకల్ ను కలవడానికి ఇక్కడకు వచ్చినట్టుగా అనిపించిందన్నారు. ఈ పవిత్ర క్షణంలో భస్మ హారతి నిర్వహించినట్టుగా ఆయన తెలిపారు.భస్మ హారతి సందర్భంగా అర్చకులు గర్బగుడిలో మెరుపులు వెలిగించారు. ఆలయంలోని నంది మందిరంలో భక్తులు వాటిని వెలిగించారు.  ఆలయ  ఆవరణలో బాణసంచా కాల్చారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios