Asianet News TeluguAsianet News Telugu

యూపీలో దారుణం.. ప్రతాప్‌గఢ్‌లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం..

యూపీలోని ప్రతాప్ ఘడ్ లో దారుణం జరిగింది. ఓ దళిత బాలికపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Atrocity in UP.. Gang rape of Dalit girl in Pratapgarh..
Author
First Published Nov 28, 2022, 3:52 PM IST

మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ దళిత బాలికపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జెత్వారా గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలిక శనివారం రాత్రి మలవిసర్జన కోసం బయటకు వెళ్లింది. అయితే అదే గ్రామానికి చెందిన 14, 17 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలురు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) అజిత్ శుక్లా తెలిపారు.

ఇంటికి తిరిగి వచ్చిన బాలిక ఈ విషయాన్ని బంధువులకు తెలియజేసింది. దీంతో వారు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులపై  సంబంధిత సెక్షన్లు, ఎస్సీ,ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల నివేదిక, వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ చెప్పారు.

హత్య నుండి సాక్ష్యాల ధ్వంసం వరకు.. అఫ్తాబ్‌కు ఎవరు సహాయం చేసారు? విచారణలో నిమగ్నమైన పోలీసులు

ఇలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీన వెలుగులోకి వచ్చింది. బార్మర్ జిల్లాలోని ధోరిమన్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ దళిత యువతికి మాటలు రావు. అలాగే చెవులు కూడా వినిపించవు. ఆమె గురువారం సాయంత్రం మేకలు మేపేందుకు వెళ్లింది. అయితే అదే సమయంలో కారులో వచ్చిన నలుగురైదుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటనలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ (ధోరిమన్న) సుఖ్‌రామ్ విష్ణోయ్ తెలిపారు.

జోరుగా సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. సైక్లిస్ట్ గా మారిన రాహుల్..

అలాగే కేరళలోని కొచ్చిలో 19 ఏళ్ల మోడల్‌పై కారులో గత గురువారం అర్థరాత్రి సమయంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు, ఓ మహిళను ఎర్నాకులం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ సమీపంలోని పబ్‌కు వెళ్లి మద్యం తాగింది. ఓ యువకుడు ఆమె దగ్గరికి వెళ్లి కారులో ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నయువతి అతడి మాటలను నమ్మింది. ఇంటికి వెళ్లే దారిలోనే యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలిని ఆమె రూమ్‌మేట్‌ కలమసేరి మెడికల్ కాలేజీకు చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులు, ఓ మహిళను అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను కేరళలోని ఎర్నాకులం కోర్టు లో పోలీసులు ప్రవేశపెట్టారు. వారిని కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పజెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios