Asianet News TeluguAsianet News Telugu

హత్య నుండి సాక్ష్యాల ధ్వంసం వరకు.. అఫ్తాబ్‌కు ఎవరు సహాయం చేసారు? విచారణలో నిమగ్నమైన పోలీసులు 

శ్రద్ధా హత్య కేసు న్యూస్: శ్రద్ధా హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా ఆధారాలను ఉటంకిస్తూ.. పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రద్దాను హత్య చేయడంలో నిందితుడు అఫ్తాబ్ ఎవరి సహయమైనా కోరి ఉండవచ్చా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల అది పూర్తి కాలేదు. నేడు అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష మరోసారి నిర్వహించనున్నారు. 

Shraddha Murder Case: From murder to destruction of evidence, who helped Aftab
Author
First Published Nov 28, 2022, 3:03 PM IST

శ్రద్ధా వాకర్ హత్య కేసు: శ్రద్ధా హత్య కేసులో రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. ఈ మర్డర్ మిస్టరీలో ఆధారాలను ఉటంకిస్తూ.. తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా హత్యకేసులో నిందితుడైన అఫ్తాబ్ పూనావాలాకు ఎవరైనా సహయం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్తాబ్ హత్యలో గానీ, సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో గానీ అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ సన్నిహితుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..నిందితుడు అఫ్తాబ్ విచారణలో శ్రద్ధ హత్య కేసుకు సంబంధించి విభిన్న కథనాలు చెబుతూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.

మరోసారి పాలిగ్రాఫ్ పరీక్ష  

శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు మరోసారి పాలిగ్రాఫ్ పరీక్ష చేయనున్నారు. ఇప్పటి వరకు పాలిగ్రామ్ పరీక్ష 20 గంటలకు పైగా జరిగింది. అయితే ఆ సమయంలో ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ముఖ్యమైన క్లూ లభించలేదు. పాలిగ్రాఫ్ పరీక్షలో అఫ్తాబ్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఈ విషయం గురించి అడిషనల్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా మాట్లాడుతూ..  పాలిగ్రఫీ పరీక్ష ఒక సెషన్ మిగిలి ఉందని, దీని కోసం అఫ్తాబ్‌ను నేడు పరీక్ష కోసం తీసుకువస్తామని చెప్పారు. తమ సిబ్బంది సిద్ధంగా ఉంటుందనీ, అఫ్తాబ్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కి తీసుకురాగానే, పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు.

అంతకుముందు నిందితుడు అఫ్తాబ్‌కు మూడు రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినప్పటికీ, అతని అనారోగ్య కారణాలతో పరీక్ష పూర్తి కాలేదని తెలిపారరు. ఈ సందర్భంగా అఫ్తాబ్‌కు శ్రద్ధతో సంబంధం, హత్య కేసుకు సంబంధించి 50కి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలిపారు.ప్రస్తుతం అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నాడు. అన్ని పరీక్షలకు పోలీసులకు మూడు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో అఫ్తాబ్ నుండి సాక్ష్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తారు.

త్వరలో నార్కో పరీక్ష

పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్టు కూడా ఈ వారంలోనే నిర్వహించవచ్చు. సమాచారం ప్రకారం.. అప్తాబ్ సమాధానాలు, దొరికిన ఆధారాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు నార్కో పరీక్ష కోసం 70 ప్రశ్నలతో కూడిన సుదీర్ఘ జాబితాను సిద్ధం చేశారు. అయితే.. ముందుగా  పాలిగ్రాఫ్ పరీక్ష పూర్తి నివేదిక రావాల్సి ఉంది. అందువల్ల నార్కో పరీక్షకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios