Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా ఓ కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. సోమవారం ఉదయం 8.30 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

A terrible accident in Jammu and Kashmir.. a car plunged into a valley.. four died
Author
First Published Nov 28, 2022, 3:10 PM IST

జమ్మూకాశ్మీర్‌లోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఉధంపూర్ జిల్లాలో ఓ కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇందులో ఓ ముస్లిం మత నాయకుడు, ఆయన కుటుంబంలోని ముగ్గురు సభ్యుల ఉన్నారు.

హత్య నుండి సాక్ష్యాలను ధ్వంసం వరకు.. అఫ్తాబ్‌కు ఎవరు సహాయం చేసారు? విచారణలో నిమగ్నమైన పోలీసులు  

వివరాలు ఇలా ఉన్నాయి. జామియా మసీదుసు చెందిన ఇమామ్ ముఫ్తీ అబ్దుల్ హమీద్ (32), తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి గూల్ సంగల్దాన్ నుండి ఉధంపూర్ వైపు వెళ్తోంది. ఉదయం 8.30 గంటల సమయంలో ఉధంపూర్ జిల్లా చెనాని ప్రాంతంలోని ప్రేమ్ మందిర్ సమీపానికి చేరుకునే సరికి కారు అదుపుతప్పి 700 అడుగుల లోయలో పడిపోయింది.

అసోం యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 2వ అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి.. ఐదుగురు అరెస్టు

ఈ ప్రమాదంలో ముఫ్తీ అబ్దుల్ హమీద్ తో పాటు ఆయన తండ్రి ముఫ్తీ జమాల్ దిన్ (65) అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆయన తల్లి హజ్రా బేగం (60), మేనల్లుడు ఆదిల్ గుల్జార్ (16) తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిని ఉదంపూర్ జిల్లాలోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో వారు కూడా మరణించారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

జోరుగా సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. సైక్లిస్ట్ గా మారిన రాహుల్..

ఇదిలా ఉండగా.. గత నెల 5వ తేదీన ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో కూడా ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 32 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇదే రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీన చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios