మహారాష్ట్రలో ఓ ట్రక్కు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 50 జీవాలు అక్కడికక్కడే మరణించాయి. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. నాగపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా వచ్చి గొర్రెలపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ మూగ జీవులు టైర్ల కింద నగిలిపోయి ప్రాణాలు కోల్పోయాయి. మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన నాగ్ పూర్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50 గొర్రెలు మరణించగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

వార్నీ.. బజ్జీలు తినేందుకు వెళ్లడానికి అంబులెన్స్ సైరన్ వేసిన డ్రైవర్.. హైదరాబాద్ లో ఘటన.. వీడియో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన రబ్బానీ అనే గొర్రెల కాపరి తన గొర్రెల మందను తీసుకొని భండారా-నాగ్ పూర్ రహదారిపై వెళ్తున్నాడు. వాటిని ఆయన చాపెగాడి కుహి ప్రాంతానికి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే ఆ మంద మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో నాగ్ పూర్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఆ గొర్రెల మందను ఢీకొట్టింది. దీంతో వాటిలో అనేకం టైర్ల కింద నలిగిపోయాయి.

టీ బీజేపీ దూకుడు.. ఆర్టీఐ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు సేకరించాలని ప్లాన్.. వాటితో ఏం చేయనుందంటే

నాగపూర్ జిల్లా మౌదా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో 50 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ తన వాహనంతో పరారయ్యాడు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరికి రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.