బజ్జీలు తినేందుకు వెళ్లడానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ సైరన్ ను యాక్టివేట్ చేశాడు. అందులో పేషెంట్లు ఉన్నారని భావించి ట్రాఫిక్ కానిస్టేబుల్ రూట్ క్లియర్ చేశారు. కానీ తరువాత అందులో పేషెంట్లు ఎవరూ లేరని తెలియడంతో డ్రైవర్ ను కానిస్టేబుల్ నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓ అంబులెన్స్ డ్రైవర్ సైరన్ ను దుర్వినియోగం చేశాడు. సిబ్బంది బజ్జీలు తినేందుకు, కూల్ డ్రింక్స్ తాగడం కోసం అంబులెన్స్ సైరన్ ను ఉపయోగించి, ట్రాఫిక్ క్లియరెన్స్ పొందాడు. అనంతరం ఆ వాహనం ఓ రెస్టారెంట్ దగ్గరకు వెళ్లి ఆగింది. దీనిని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే అక్కడికి వెళ్లారు. ఆ డ్రైవర్ కు క్లాస్ తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అత్యాచార బాధితురాలిని బిడ్డకు జన్మనివ్వాలని బలవంతం చేయరాదు - అలహాబాద్ హైకోర్టు

వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ సోమవారం రాత్రి రద్దీగా ఉండే బషీర్ బాగ్ జంక్షన్ మీదుగా వెళ్తోంది. అయితే ఆ డ్రైవర్ అత్యవసర సమయాల్లో ఉపయోగించే సరైన్ ఆన్ చేశాడు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే ఆ వాహనం వెళ్లేందుకు వీలుగా రూట్ క్లియర్ చేశారు. అయితే అంబులెన్స్ కు క్లియరెన్స్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసు ఆసుపత్రికి వెళ్లకుండా రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ వద్ద ఆగినట్లు గుర్తించారు.

Scroll to load tweet…

దీంతో కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి ఆ డ్రైవర్ ను ప్రశ్నించాడు. ఆ సమయంలో అంబులెన్స్ లో రోగి ఎవరూ లేరని ఆయన గుర్తించాడు. కేవలం ట్రాఫిక్ క్లియరెన్స్ పొందడానికి మాత్రమే డ్రైవర్ సైరన్ ను యాక్టివేట్ చేసినట్లు విచారణలో తేలింది. పైగా దానిని కప్పిపుచ్చుకునేందు ఆయన ప్రయత్నించాడు. ఇదంతా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు అమర్చి బాడీ క్యామ్ లో రికార్డు అయ్యింది. 

ఆ వీడియోలో డ్రైవర్ ఫ్రూట్ జ్యూస్ బాటిల్ ను పట్టుకొని కనిపిస్తున్నాడు. ఓ నర్సుకు ఆరోగ్యం బాగా లేదని, ఆమెకు నీరసంగా ఉంటే ఇక్కడ ఆపానని అందులో ఆయన చెబుతున్నాడు. దీనిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రైవర్ తో మాట్లాడుతూ.. ‘‘మీరు సైరన్ ఆన్ చేసిన తర్వాత అంబులెన్స్ కు క్లియరెన్స్ ఇచ్చాను. కానీ ఆస్పత్రికి వెళ్లకుండా మీరు మిర్చి బజ్జీలు తింటూ టీ తాగుతున్నారు. రోగి ఎక్కడ ఉన్నాడు? మిర్చి బజ్జీ తినేందుకు సైరన్ ఆన్ చేశారా?’’ అంటూ ప్రశ్నిస్తూ.. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని, వారే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. 

టీ బీజేపీ దూకుడు.. ఆర్టీఐ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు సేకరించాలని ప్లాన్.. వాటితో ఏం చేయనుందంటే

కాగా.. మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించినందుకు డ్రైవర్ కు రూ.1,000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. సైరన్ల దుర్వినియోగాన్ని ప్రస్తావిస్తూ.. డీజీపీ అంజనీకుమార్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. అంబులెన్స్ సేవలను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కోరారు. నిజంగా, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి సైరన్లను యాక్టివేట్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.