బీఆర్ఎస్ నాయకులను ఇరకాటంలో పెట్టేందుకు తెలంగాణ బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆస్తుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించాలని భావిస్తోంది. వీటిని ప్రజలు ముందు ఉంచాలని అనుకుంటోంది.
తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు సిద్ధం చేసేందుకు, వారిలో చైతన్యం నిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసిన అధిష్టానం ఇప్పుడు దానికి తుదిరూపునిచ్చే పనిలో పడింది.
‘కమలం’లో చిచ్చుపెట్టిన సోషల్ మీడియా పోస్టులు.. నాంపల్లి ఆఫీసులోనే ఈటల, బండి వర్గీయుల పరస్పర దూషణలు..
కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ నాయకులతో పోరాడేందుకు, ఆ పార్టీ నాయకులను ఇరకాటంలో పెట్టేందుకు వీలుగా బీజేపీ హైకమాండ్ ఓ కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా సేకరించాలని భావిస్తోంది. గతంలో వారికి ఎన్ని ఆస్తులు ఉండేవి, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తరువాత ఎంత పెరిగాయి అనే విషయాలు బట్టబయలు చేస్తూ.. ప్రజలు ముందర పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ఆస్తుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకోవాలని పార్టీ హైకమాండ్ అనుకుంటోంది. నాంపల్లి బీజేపీ ఆఫీసులో రెండు రోజుల పాటు పదాధికారుల మీటింగ్ జరిగింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. ఇందులో వంద రోజుల ప్రణాళికను నిర్ణయించారు.
అత్యాచార బాధితురాలిని బిడ్డకు జన్మనివ్వాలని బలవంతం చేయరాదు - అలహాబాద్ హైకోర్టు
ఈ ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో డబుల్ బెడ్ రూం ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు, రైతు రుణ మాఫీ, ధరణి వంటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అనుకుంటోంది. దళిత వాడలను, బస్తీల్లో పర్యటిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన వివరాలను ప్రజలకు వివరించాలని భావిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటోంది.
ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం.. ఏమిటీ అవార్డు ? దాని ప్రత్యేకతలేంటంటే ?
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు కలిగిన మేలును తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టాని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అలాగే ఆగస్టు 15వ తేదీలోపు 85 చోట్ల బహిరంగ సభలు పెట్టాలని భావిస్తోంది. కాగా.. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఈ నెల 29వ తేదీన ఖమ్మం సిటీలో ఓ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర అధిష్టానం భావిస్తోంది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
