ప్రియుడి ఆత్మహత్యతో మనస్థాపానికి గురైన ఓ యువతి కూడా అదే దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. 

గురుగ్రామ్ లో దారుణం జరిగింది. ప్రియుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో మనస్థాపానికి గురైన ప్రియురాలు కూడా అదే దారుణానికి ఒడిగట్టింది. ఆమెను స్థానికులు హాస్పిలల్ కు తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

బీజేపీ స‌ర్కారుపై కాంగ్రెస్ ఫైర్.. నెల రోజుల పాటు దేశ‌వ్యాప్త‌ నిరసనలు

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన 30 ఏళ్ల మంజు హర్యానాలోని గురుగ్రామ్ లో నివసిస్తోంది. ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సెక్టార్ 37 ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే స్థానికంగా ఓ కిరాణా దుకాణం నడుపుతున్న బాబూలాల్‌తో ఆమెకు కొంత కాలంగా ప్రేమలో ఉంది.

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్‌ లోక్‌సభ సభ్యతం పునరుద్దరణ..

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాబూలాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మంజు తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. రాత్రి సమయంలో తన గదికి చేరుకొని అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను స్థానికులు సివిల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

వారెవ్వా.. మూడో భార్య సాయంతో నాలుగో పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికొడుకు.. చివరికి ఏం జరిగిందంటే ?

అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం ఆమె మరణించిందని సెక్టార్ 37 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సునీత తెలిపారు. ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోటూ లభించలేదని పోలీసులు తెలిపారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు చెప్పారు. 

తెలంగాణలో ప్రజలు బీజేపీని మాత్రమే నమ్ముతున్నారు.. ప్రధాని మోదీ

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు.