తమిళనాడు కు చెందిన ఓ వ్యక్తి మూడో భార్య సాయంతో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. నాలుగో భార్య దగ్గర ఉన్న డబ్బును, బంగారాన్ని మొత్తం ఖర్చు చేసుకున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. 

అతడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల కిందట సొంత ఊరికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేశారు. కొంత కాలం తరువాత ఆ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తరువాత అతడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె తో కూడా విడిపోయాడు. ఆ తరువాత కూడా మళ్లీ ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె సాయంతో మరో యువతిని పెళ్లాడాడు. ఇలా నిత్య పెళ్లికొడుకుగా మారిన అతడి బాగోతం తాజాగా బయటపడింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

మోగ‌నున్న క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా.. నేడు షెడ్యూల్ ప్ర‌క‌టించ‌నున్న ఈసీ

విలాసవంతమైన జీవితం గడిపేందుకు నలుగురిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లాలోని తిరుముల్లైవాయల్‌ కు చెందిన 45 ఏళ్ల వినోద్‌ రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి విదేశాలలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల కిందట సెలవుల కోసం ఆయన ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు ఓ యువతిని చూసి అతడికి పెళ్లి చేశారు. కొంత కాలం పాటు సవ్యంగానే సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో వారిద్దరూ విడిపోయారు.

కునో నేషనల్ పార్క్ లో చీతా మృతిపై రాజకీయ రగడ..అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎందుకు తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ విమర్శలు

మరి కొంత కాలం తరువాత తల్లిదండ్రులు అతడికి మరో యువతితో రెండో పెళ్లి చేశారు. ఆమెతో కూడా వినోద్ రాజ్ కుమార్ కొన్ని నెలల తరువాత విడిపోయాడు. దీంతో మరో యువతిని చూసి మూడో పెళ్లి కూడా చేశారు. ఆమెతో కాపురం కొనసాగిస్తున్నాడు. అయితే విలాసవంతమైన జీవితం గడిపేందుకు మూడో భార్య సాయంతో అతడు నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఆ కుటుంబం పార్టీకి ఇరుసు లాంటిది.. పార్టీలో ఐక్యత ఆ కుటుంబంతోనే : అశోక్ గెహ్లాట్

ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయన్న విషయాన్ని దాచాడు. తూత్తుకుడి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ప్యూలా అనే మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని, డబ్బులను తీసుకొని ఖర్చు చేశాడు. అయితే కొంత కాలం తరువాత తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. దీంతో అతడిని వెతుక్కుంటూ నాలుగో భార్య ప్యూలా కూడా అక్కడికి వచ్చింది. అయితే అక్కడ వినోద్‌ రాజ్‌కుమార్‌ తన మూడో భార్యతో కాపురం చేస్తున్న విషయాన్ని ఆమె గమనించింది. వెంటనే ఆమె తూత్తుకుడి మహిళా పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.