Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దారుణం.. బాలిక‌ను స్కూల్ వాష్‌రూమ్‌లో బంధించి గ్యాంగ్ రేప్.. ఘ‌ట‌న‌పై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్

దేశ రాజధానిలోని ఓ స్కూల్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నివేదిక అందించాలని మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. 

Atrocity in Delhi.. The girl was gang-raped in the washroom of the school.. Women's Commission is serious about the incident.
Author
First Published Oct 7, 2022, 11:00 AM IST

ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఓ స్కూల్ వాష్ రూమ్ లో మైన‌ర్ పై అదే స్కూల్ కు చెందిన ఇద్ద‌రు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ అయ్యింది. దీనిపై నివేదిక ఇవ్వాల‌ని ఢిల్లీ పోలీసుల‌కు నోటీసులు పంపించింది. 

షాకింగ్.. యజమానురాలిని బెదిరించి, యేడాదిగా కారు డ్రైవర్ అత్యాచారం..!

ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..  ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ (కేవీ) వాష్‌రూమ్‌లో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు జూలైలో సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆ స్కూల్ టీచర్ దాచిపెట్టేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే బాధితురాలు గ‌త మంగ‌ళ‌వారం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న‌పై జ‌రిగిన దారుణాన్ని వారికి వివ‌రించింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

వాష్ రూమ్ లో బంధించి.. 
మ‌హిళా క‌మిష‌న్, బాధిత బాలిక వెల్ల‌డించిన‌ వివ‌రాల ప్ర‌కారం.. మైన‌ర్ బాలిక జూలైలో త‌న క్లాస్ రూమ్ కు వెళ్తోంది. అదే స‌మ‌యంలో స్కూల్ కు చెందిన 11, 12 తరగతి చ‌దివే ఇద్ద‌రు అబ్బాయిలను ఢీకొట్టింది. దీంతో వారికి బాలిక క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కానీ వారు ఆమెను దుర్భాషలాడడం ప్రారంభించారు. త‌రువాత స్కూల్ లో ఉన్న టాయిలెట్ లోప‌లికి తీసుకెళ్లారు. అనంత‌రం లోప‌లి నుంచి తలుపుల‌కు లాక్ వేసి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. 

భార్యపై అనుమానం.. కూతురిని చంపి, బకెట్లో కుక్కి, గడ్డివాములో దాచిపెట్టిన భర్త..

ఈ ఘ‌ట‌న‌ను బాలిక త‌న టీచ‌ర్ కు తెలియ‌జేసింది. దీంతో ఆ ఇద్ద‌రు బాలుర‌ల‌ను స్కూల్ నుంచి బ‌హిష్క‌రించారు. కానీ ఈ విష‌యాన్ని పోలీసుల‌కు తెలియ‌కుండా దాచిపెట్టారు. కానీ బాలిక పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ అత్యాచార ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది.

ఘ‌ట‌న‌పై ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. ‘‘ ఢిల్లీలోని ఒక పాఠశాలలో 11 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని స్కూల్ టీచర్ దాచి పెట్టేందుకు ప్రయత్నించారని బాలిక ఆరోపించింది. ఇది చాలా బాధాకరం. దేశ రాజధానిలోని పిల్లలకు పాఠశాలలు కూడా సురక్షితం కాకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై పాఠశాల అధికారుల పాత్రపై విచారణ జరపాలి ’’ అని ఆమె పేర్కొన్నారు.

దేశ తొలి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ కారు డ్రైవర్ మోనప్ప గౌడ్ కన్నుమూత..

ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్, అరెస్టుల కాపీని అందించాలని మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయనందుకు స్కూల్ టీచర్, ఇత‌ర సిబ్బందిపై తీసుకున్న చర్యల సమాచారాన్ని అందించాల‌ని పోలీసుల‌ను కోరింది. ఈ విషయం పాఠశాల అధికారులకు ఎప్పుడు తెలిసిందో, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ని కూడా కమిషన్ ఆదేశించింది. ఈ విషయంలో చేప‌ట్టిన విచారణ నివేదిక కాపీని అందజేయాలని కోరింది.ఈ ఘటనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో తెలియజేయాలని పాఠశాల అధికారులను కోరింది. కాగా.. కేంద్రీయ విద్యాలయ సంగతన్ ప్రాంతీయ కార్యాలయం కూడా ఈ అంశంపై విచారణకు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios