Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురి హత్య.. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెల్లు

ఢిల్లీ దారుణం జరిగింది. డ్రగ్స్ కు బానిసైన ఓ వ్యక్తి తన బంధువుల కుటుంబాన్ని హత్య చేశాడు. ఇద్దరు అక్కాచెల్లెల్లు, వారి అమ్మమ్మ, తండ్రిని అతడు హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Atrocity in Delhi.. Four people were killed in the same family.. Two of the dead were sisters
Author
First Published Nov 23, 2022, 9:00 AM IST

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు అక్కా చెల్లెల్లు ఉన్నారు. మరో ఇద్దరులో ఒకరు మృతుల తండ్రి కాగా.. మరొకరు అమ్మమ ఉన్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇది స్థానికంగా కలకరం రేపింది. 

వివాదంలో యువరాజ్ సింగ్.. నోటీసులు జారీ చేసిన గోవా టూరిజం శాఖ..

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని పాలం ప్రాంతంలోని ఓ ఇంట్లో తండ్రి తన ఇద్దరు కూతుర్లతో కలిసి నివసిస్తున్నాడు. వారి వెంట అతడి అత్త కూడా ఉంటోంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మంగళవారం వారంతా హత్యకు గురై చనిపోయి కనిపించారు. ఈ విషయం స్థానికులు మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో పాలెం పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తరువాత కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో పడి ఉన్నారు. మహిళల్లో ఒకరు నేలపై పడి ఉండగా, ఇద్దరు సభ్యులు బాత్‌రూమ్‌లో హత్యకు గురయ్యారు. 

భారత్ లో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ .. ప్రపంచ ర్యాంకింగ్ ల మీద సంజీవ సన్యాల్ ఏమన్నారంటే...

ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మృతుల బంధువు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలే నేరానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అలాగే అతడు డ్రగ్స్ కు బానిసయ్యాడని తెలుస్తోంది. ‘‘పాలం ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు సోదరీమణులు, వారి తండ్రి, అమ్మమ్మ హత్య గురయ్యారు. ఓ వ్యక్తి ఆ నలుగురు సభ్యులను కత్తితో పొడిచి చంపారు. నిందితుడిని అరెస్టు చేశారు ’’ అని ఢిల్లీ పోలీసులు వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు. 

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా-2025.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షత ఉన్నత స్థాయి సమావేశం

ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందట ఢిల్లీలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఓ వ్యక్తి సొంత భార్యను చంపేసిన ఘటన చోటుచేసుకుంది. అప్పులకు సంబంధించి ఇరువురి మధ్యల జరిగిన ఘర్షణలో అతడు భార్యను హతమార్చినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని నేరుగా పోలీసులకు ఫోన్ చేసి తాను తన భార్యను చంపేసినట్టు సమాచారం ఇవ్వడం గమనార్హం. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ఢిల్లీలోని హర్ష విహార్ పోలీసు స్టేషన్‌కు ఒక కాల్ వెళ్లింది. యోగేశ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాను తన భార్యను చంపేశానని చెప్పాడు. ఉదయమే వచ్చిన ఆ ఫోన్‌లో ఒక వ్యక్తి హత్యానేరాన్ని అంగీకరిస్తాడని ఊహించలేదు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే వారు సుశీల గార్డెన్‌లోని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. వారి నివాసంలో అర్చన ఫ్లోర్ పై అపస్మారకస్థితిలో పడి ఉన్నారు.

భూపేంద్ర పటేల్ ఓ తోలుబొమ్మ సీఎం.. ప్యూన్‌ను కూడా మార్చలేరు: కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్య‌లు

వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. ఢిల్లీ పోలీసులు 35 ఏళ్ల యోగేశ్ కుమార్‌ను అరెస్టు చేశారు.  ప్రాథమిక విచారణ ప్రకారం, వారి కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. అర్చనా వేర్వేరు వ్యక్తుల నుంచి డబ్బును అప్పుగా తీసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరుగుతుండగానే భార్య  అర్చనను యోగేశ్ కుమార్ గొంతు నులిమి హత్య చేశాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios