Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. బర్త్ డే వేడుకల్లో యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం..

ఓ మహిళను బర్త్ డే  వేడుకులకు ఆహ్వానించి ఆమెకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుండగులు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. 

Atrocious.. Young woman gang-raped after drinking alcohol during birthday celebrations..
Author
First Published Nov 14, 2022, 4:18 PM IST

పశ్చిమ బెంగాల్ లో దారుణం జరిగింది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో యువతికి మద్యం తాగించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇందులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటన కోల్‌కతాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలి.. పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం.. పిటిషనర్ కు చురకలు ..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలో ఉత్తర శివార్లలోని రాజర్‌హట్‌లోని బంగ్లాలో గురువారం ఓ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఈ వేడుకకు ఓ మహిళ 21 ఏళ్ల బాధితురాలిని ఆహ్వానించింది. దీంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఆ పార్టీలో 10 మందికి పైగా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా మహిళకు మద్యం తాగించారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం వంతుల వారీగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

తనపై అత్యాచారం జరిగినట్టు బాధితురాలికి శుక్రవారం తెలిసింది. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని నార్త్ 24 పరగణాస్‌లోని బరాసత్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ ఘటనపై బిధాన్‌నగర్ పోలీసు కమిషనర్ గౌరవ్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ మేము బంగ్లా ఎంట్రెన్స్, ఎక్సిట్ గేట్ ల దగ్గర అమర్చిన సీసీ కెమెరాల నుంచి ఫుటేజీలను సేకరించాం. మా టీం ఆ ఫుటేజీని పరిశీలిస్తోంది ’’అని తెలిపారు. 

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జితేంద్ర అవద్.. ఎందుకంటే ?

అస్సాంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కరీంగంజ్‌లో 13 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి.. ఇతరులకు షేర్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ అస్సాంలోని రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగంజ్‌లో స్థానికంగా నివసించే..  ఆరుగురు యువకులు ఓ మైనర్ బాలిక కన్నేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికతో మాటలు కలిపి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఆ బాలికపై దాడి చేసి..  ఒక్కరి తర్వత ఒక్కరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ దుండగులు ఆ దారుణాన్ని తమ ఫోన్‌లలో చిత్రీకరించారు. జరిగిన విషయాన్ని బయటకు చెప్పితే హెచ్చరించారు.

హర్యానా మాజీ గవర్నర్ ధనిక్ లాల్ మండల్ మృతి.. సీఎం,గవర్నర్ సంతాపం

చివరికి ఈ విషయాన్నిబాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారానికి సంబంధించిన వీడియోను నిందితులు పలువురికి షేర్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి నిందితులను జువైనల్ హోంకు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios