శరద్ పవర్ కు సన్నిహితుడిగా ఉన్న ఎన్సీపీ సీనియర్ నేత జితేంద్ర అవద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనపై పోలీసులు అక్రమంగా రెండు కేసులు నమోదు చేశారని, అందుకే తాను ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు. 

మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఎన్‌సీపీ సీనియర్ నేత జితేంద్ర అవద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 72 గంటల వ్యవధిలో ఆయనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో అవద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. “పోలీసులు 72 గంటల్లో నాపై 2 తప్పుడు కేసులు నమోదు చేశారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడతాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటున్నాను. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని మేము చూడలేము.’’ అని పేర్కొన్నారు. 

హర్యానా మాజీ గవర్నర్ ధనిక్ లాల్ మండల్ మృతి.. సీఎం,గవర్నర్ సంతాపం

కాగా.. ఆదివారం రాత్రి అవద్‌పై వేధింపుల కేసు కూడా నమోదైందని నివేదికలు చెబుతున్నాయని ‘టైమ్స్ నౌ’తన కథనంలో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో అవద్ ఓ సినిమా ప్రదర్శనను బలవంతంగా మూసివేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను కూడా ఆయన కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. 

ఏమీటీ కేసులు ? 
ఆదివారం కల్వా-ఖాదీ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలవడానికి ఓ బీజేపీ కార్యకర్త వెళ్లారు. అయితే ఆమె షిండేని పలకరించేందుకు గుంపులో ముందుకు వెళ్లింది. అయితే ఆ సమయంలో అవద్ ఆమె చేతిని పట్టుకొని పక్కకు జరిపాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవద్ అనుమతి లేకుండా తన చేతిని తాకరని, నీచమైన చర్యకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయనపై వేధింపుల కేసు నమోదు చేశారు.

ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషన్లు.. అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం

దీని కంటే ముందు ‘హర్ హర్ మహాదేవ్’ సినిమా ప్రదర్శనను బలవంతంగా నిలిపివేసినందుకు అవద్, ఆయన మద్దతుదారులపై కేసు నమోదైంది. నవంబర్ 7న థానేలోని ఓ సినిమా హాలులో ఈ ఘటన జరిగింది. ప్రదర్శన నిలిపివేయడాన్ని నిరసిస్తూ తమను కూడా కొట్టారని సినీ ప్రేక్షకులు ఆరోపించారు. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను వక్రీకరించిందని అవద్, అతడి మద్దతుదారులు ఆరోపించారు. కాగా.. ఈ కేసులో అవద్‌తో పాటు మరో 11 మందికి మహారాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇదిలా ఉండగా 2020లో థానేకు చెందిన ఓ సివిల్ ఇంజనీర్‌ను కొట్టినందుకు అవద్‌తో పాటు 15-20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన మహారాష్ట్ర ఎంవీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అయితే అదే రోజు ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది.

చిల్డ్రన్స్ డే 2022 : ఇవి కూడా పిల్లలే... కోతిపిల్లతో బాతుపిల్లల ఆట.. ఫిదా అవుతున్న నెటిజన్లు...

అవద్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు. 1982లో విద్యార్థి కార్యకర్తగా రాజకీయాల్లో చేరి కాంగ్రెస్‌లో చేరారు. శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు ఆయన వెంట అవద్ నడిచాడు. ఎన్సీపీలో చేరాడు. ముంబ్రా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2002, 2008లో రెండు పర్యాయాలు మహారాష్ట్ర శాసన మండలి సభ్యునిగా నామినేట్ అయ్యాడు. అయితే అవద్ రాజీనామా చేయడంతో ముంబ్రాలో నిరసనలు చెలరేగాయి.