గాజు సీసాలో టపాకాయలు కాల్చవద్దని సూచించడమే ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. ముగ్గురు మైనర్ బాలురు కలిసి ఆ యువకుడిని దారుణంగా హత్య చేశారు. మహారాష్ట్రలోని ముంబాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దేశమంతా సంతోషంగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ముంబాయిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. గాజు సీసాలో టపాకాయలు పేల్చొద్దని చెప్పినందుకు ఓ యువకుడిని ముగ్గురు మైనర్ లు హత్య చేశారు. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.
మఠంలో స్వామీజీ అనుమానాస్పద మృతి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ సూసైడ్ లెటర్ ?
శివాజీ నగర్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 12 ఏళ్ల యువకుడు గాజు సీసాలో టపాకాయలు పెట్టి కాల్చుతున్నాడు. దీనిని గమనించిన 21 ఏళ్ల సునీల్ శంకర్ నాయుడు ఆ బాలుడి వద్దకు వచ్చాడు. ఇది మంచి పద్దతి కాదని, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పాడు. గాజు సీసాలతో ఇలా చెలగాటం ఆడకూదని, అందులో టపాకాయలు పెట్టి కాల్చవద్దని సూచించాడు. దీంతో ఆ బాలుడికి కోపం వచ్చింది.
కోయంబత్తూరు కారు పేలుడు: ఐదుగురు అరెస్ట్
వీరిద్దరి మధ్య మాటలు జరుగుతుండగా ఆ బాలుడి 14 ఏళ్ల సోదరుడు, 15 ఏళ్ల స్నేహితుడు కలిసి వచ్చారు. సునీల్ శంకర్ నాయుడితో వాగ్వాదానికి దిగారు. ఇది ముదిరింది. ముగ్గురు మైనర్లు యువకుడిపైకి తిరగబడి, దాడి చేశారు. ఈ క్రమంలో ఓ మైనర్ సునీల్ మెడపై కత్తితో పొడిచి పారిపోయాడు.
మిరాకిల్.. మీదినుంచి కారు వెళ్లినా.. ఏమీ కానట్టు లేచి వెళ్లిన చిన్నారి...
ఈ క్రమంలో ఆ మైనర్ల వెంట సునీల్ కూడా పరిగెత్తడం ప్రారంభించారు. వారి వెంట పరిగెత్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అందులో బాధితుడు తన మెడపై చేయి వేసుకొని మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రక్తస్రావం, నొప్పి వల్ల ఆయన మెట్లను ఎక్కలేక నేల మీదనే పడుకున్నాడు.
చిట్టి చిట్టి చేతులతో... తండ్రికి మేకప్ వేసిన కూతురు...!
స్థానికులు వెంటనే సునీల్ ను హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. ఈ ఘటనలో మైనర్లపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఆ బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
