మిరాకిల్.. మీదినుంచి కారు వెళ్లినా.. ఏమీ కానట్టు లేచి వెళ్లిన చిన్నారి...
కారు మీదినుంచి వెళ్లినా ఓ చిన్నారి బతికి బయటపడింది. చూసినవారికి ఇదొక మిరాకిల్ లాగా అనిపించింది. ఇదంతా వీడియోలో రికార్డయ్యింది.
యాక్సిడెంట్ కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం.. కానీ కొన్ని వీడియోల్లో సదరు వ్యక్తులు బతకరు.. అనిపించేంత దారుణమైన ప్రమాదం జరుగుతుంది. అయినప్పటికీ చాలామంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటనలు ఎన్నో చూశాం. అయితే ఈ ఘటన మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నారిపై నుంచి కారు వెళ్ళిపోయింది. అయితే ఆమె ఒంటిపై ఒక్క గాయం కూడా కాలేదు. పైగా ఆ చిన్నారి సైలెంట్ గా తనకు తానుగా లేచి వెళ్ళిపోయింది.
అసలేం జరిగిందంటే… ఒక చిన్నారి తన చిన్న సైకిల్ తో రోడ్డుపై వెడుతోంది. ఇంతలో అటుగా వస్తున్న ఓ కారు ఆ చిన్నారిని ఢీ కొట్టింది. దీంతో ఆ చిన్నారి కారు కింద పడిపోయింది. అంతేకాదు కారు ముందు చక్రం ఆ చిన్నారి పై నుంచి వెళ్ళిపోయింది. అయితే అనూహ్యంగా ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. పైగా ఆ చిన్నారి తనకు తానుగా లేచి భయంతో ఏడుస్తూ వెళ్ళిపోయింది. మిరాకిల్ అంటే ఇది కదా... బతకాలని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా బతికేస్తాను కాబోలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
గాజు సీసాలో టపాసులు పేల్చొద్దన్నందుకు.. వ్యక్తిని కత్తితో పొడిచిన మైనర్లు, చికిత్స పొందుతూ మృతి...
ఇదిలా ఉండగా, దీపావళికి సంబంధించిన ఇలాంటి వైరల్ వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్ కొత్తగా ఆలోచించాడు. అందరిలో మనం కూడా బాణాసంచా మామూలుగా కాలిస్తే కిక్కేముంది… అనుకున్నాడో ఏమో ..డిఫరెంట్ గా ఆలోచించాడు. రాజస్థాన్లోని ఆల్వార్ కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. దీపావళికి కొత్తగా ఏం చేద్దాం అని ఆలోచించాడు.. ఓ కారును టార్గెట్ చేశాడు.. దీపావళిని పురస్కరించుకుని ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులను వరుసగా పేర్చాడు. కారు ముందు ఉన్న గ్లాస్ పై మాత్రం టపాసులు పెట్టలేదు. ఆ తర్వాత వన్ టూ త్రీ అంటూ బాంబులు పేల్చాడు.
ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్దాలతో మారుమోగిపోయింది. లక్ష టపాసులు మరి. ఆ తర్వాత మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళాడు. బాంబులు పేలడంతో కారు కలర్ మొత్తం మారిపోయింది. కారులోపల పొగ పూర్తిగా నిండిపోయింది. కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ గ్లాస్ మెత్తబడి పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ మాత్రం పని చేయడం విశేషం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, దీనిమీద నెటిజన్లు డిఫరెంట్గా స్పందించారు. మెంటల్ అంటూ తిట్టి పోశారు. నీ వెర్రి వెయ్యి విధాలుగా ఉంది.. అంటూ కామెంట్ చేశారు. వాళ్లన్నారని కాదుగానీ.. ఇది నిజంగా ఎంత భయంకరమైన చర్య.. ఆ బాంబులకు కారు పేలితే... ఇంకేదైనా ప్రమాదం జరిగితే.. ఏంటి పరిస్థితి.. అయితే, ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. అతను ఈ పని ఇళ్లమధ్యలో కాకుండా కాస్త దూరంగా ఓపెన్ ప్లేస్ లో ఎవ్వరూ లేని చోట చేయడమే.