Asianet News TeluguAsianet News Telugu

చిట్టి చిట్టి చేతులతో... తండ్రికి మేకప్ వేసిన కూతురు...!

కూతుళ్లు సైతం.. అమ్మ పై కంటే ఎక్కువ అనురాగం.. తండ్రిపై కురిపిస్తూ ఉంటారు. తాజాగా... ఓ తండ్రి, కూతుళ్ల వీడియో  సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఓ చిన్నారి తన చిట్టి చిట్టి చేతులతో.. తండ్రికి మేకప్ వేసుకుందుకు ప్రయత్నిస్తున్న వీడియో అది. 

viral video shows little girl doing her father makeup
Author
First Published Oct 25, 2022, 10:41 AM IST

తండ్రి-కూతురు బంధం ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. కొడుకుపై చూపించని ప్రేమను కూడా చాలా మంది తండ్రులు కూతుళ్లపై చూపిస్తారు. వారిని అపురూపంగా చూసుకుంటారు. కూతుళ్లు సైతం.. అమ్మ పై కంటే ఎక్కువ అనురాగం.. తండ్రిపై కురిపిస్తూ ఉంటారు. తాజాగా... ఓ తండ్రి, కూతుళ్ల వీడియో  సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఓ చిన్నారి తన చిట్టి చిట్టి చేతులతో.. తండ్రికి మేకప్ వేసుకుందుకు ప్రయత్నిస్తున్న వీడియో అది. 

 

చిన్నారి.. తన  చిన్ని చిన్ని చేతులతో తన తండ్రికి మేకప్ వేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోకి  2 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. మీరు కనుక బాధలో ఉంటే.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మీ బాధ అంతా పోయి.. ప్రశాంతంగా నవ్వుకోగలరు.

తాను వాళ్ల నాన్నకు మేకప్ వేస్తున్నాను అని చెప్పడంతో వీడియో ప్రారంభమౌతుంది. మంచంపై పడుకున్న తండ్రికి ఆ చిన్నారి వీడియో వేయడం మొదలుపెట్టింది. వాళ్ల అమ్మ ఈ వీడియో తీయడం విశేషం. ఆమె ఈ వీడియోలో తన మేకప్ స్కిల్స్ మొత్తం బయటపెట్టడం విశేషం. దీంతో ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎంత క్యూట్ గా వేసిందో అని నెటిజన్లు కూడా మురిసిపోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios