Asianet News TeluguAsianet News Telugu

కోయంబత్తూరు కారు పేలుడు: ఐదుగురు అరెస్ట్

తమిళనాడులోని కోయంబత్తూరులో కారులో పేలుడు ఘటనకు సంబంధించి ఐదుగురిని  పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు  ఉగ్రవాదులకు  లింకులున్నాయా అనే కోణంలో కూడ  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

 Five arrested in Coimbatore car blast
Author
First Published Oct 25, 2022, 11:07 AM IST

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కారు   పేలుడు  ఘటనకు సంబంధించి  మంగళవారంనాడు  ఐదుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. ఆదివారంనాడు జరిగిన కారు  పేలుడు  ఘటనలో ఒకరు మరణించిన విషయం తెలిసిందే.మహ్మద్ తల్కా, మహ్మద్ అజరుద్దీన్ ,మహ్మద్ రియాస్ , ఫిరోజ్ ఇస్మాయిల్ ,మహ్మద్ ఇస్మాయిల్  లను పోలీసులు  అరెస్ట్  చేశారు.కారులో  ఎల్ పీ జీ  సిలిండర్  పేలుడుతో కారులో  వ్యక్తి  మృతి  చెందారు. మృతుడి ఇంట్లో పోలీసులు  జరిపిన  సోదాల్లో భారీగా  పేలుడు  పదార్ధాలను  పోలీసులు సీజ్ చేశారు. కారు లో  సిలిండర్  పేలుడు ఘటనలో మృతి చెందిన  వ్యక్తిని జెమీసా  ముబిన్ గా పోలీసులు గుర్తించారు.

దీంతో సంఘటనా  స్థలాన్ని  డీజీపీ శైలేంద్రబాబు,ఏడీజీపీ తమరై కణ్ణన్ ,ఇంటలిజెన్స్ ఐజీ సెంథిల్ వేలన్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాంబులను  తయారు  చేసేందుకు  ఉపయోగించే  పొటాసియం నైట్రేట్ ,అల్యూమినియం ,సల్ఫర్  వంటి రసాయనాలను  స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్పారు.పేలుడు  జరిగిన  ప్రదేశంలో  బేరింగులు ,కూడ స్వాథీనం చేసుకున్నట్టుగా  పోలీసులు ప్రకటించారు. మృత చెందిన వ్యక్తి కాల్  డేటాను  పరిశీలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఉక్కడంలో ముస్లింలు మెజారిటీ సంఖ్యలో  ఉంటారు.  ఈ  ప్రాంతంలో ప్రసిద్ద కొట్టై ఈశ్వరన్ ఆలయం  ఉంది., ఈ ఆలయానికి  సమీపంలోనే కారులో పేలుడు జరిగింది.దీంతో  ఈ  ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.కోయంబత్తూరు కారు  పేలుడు ఘటనతో ఉగ్రవాదులకు లింకులున్నాయనే  అనుమానాలు వ్యక్తం కావడంతో  ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. నిన్న సాయంత్రమే ఎన్ఐఏ అధికారులు కోయంబత్తూరుకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ఐఏ  సోదాలు  నిర్వహిస్తుంది. పేలుడులో మృతి చెందిన  ముబిన్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గతంలో అతడిని ఎన్ఐఏ విచారించి వదిలేసింది. దేవాలయాలు ,బస్ స్టేషన్లు,రైల్వే స్టేషన్లలో భారీగా   భద్రతను  పెంచారు.

also read:కోయంబత్తూరు కారులో పేలుడు:ఉగ్ర వాదుల పనేనా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

ఆదివారం నాడు  కారులో సిలిండర్  పేలుడు ఘటనలో ముబీన్ మరణించాడు.ఈ పేలుడు  ఘటనకు  ముందు  ముబీన్ నివాసం  నుండి అనుమానాస్పద వస్తువులను కారులో పెట్టినట్టుగా  పోలీసులు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారుముబీన్  కారును దిగే సమయంలో పేలుడు చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.ముబీన్ నివాసంలోని సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించిన నిందితులను ఇవాళ పోలీసులు అరెస్ట్  చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios