దారుణం.. పోలీసు స్టేషన్ లో ఉరేసుకున్న యువకుడు.. విచారణకు ఆదేశించిన మానవ హక్కుల కమిషన్
ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. అయితే దీనిపై బాలిక కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిని అదుపులోకి స్టేషన్ లో ఉంచారు. దీంతో అక్కడే యువకుడు ఉరేసుకున్నాడు.
పోలీసు స్టేషన్ లో యువకుడు ఉరేసుకొని కనిపించిన ఘటన జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సవాన్ జిల్లాలో గురువారం వెలుగులోకి వచ్చింది. విచారణ కోసం అని యువకుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో ఈ దారుణం జరిగింది. దీనిపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. విచారణకు ఆదేశించింది. ఆ పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ వోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తమిళనాడులో కొనసాగుతున్న భారీ వర్షాలు.. చెన్నైలోని విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ధాల్‌భూమ్‌ఘర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు ఓ మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వారిద్దరూ అక్టోబర్ 26వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో విచారణ కోసం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. మచ్చు నదిలో ముగిసిన సెర్చ్, రెస్య్యూ ఆపరేషన్..
కాగా.. బాలిక కుటుంబం ధాల్‌భూమ్‌ఘర్‌కు వెళ్లింది. మరుసటి రోజు బాలికను నిందితుడిని బాల్ మిత్ర ఠాణా (చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్)కి తీసుకువచ్చారు. విచారణ అనంతరం బాలికను ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ యువకుడిని నిర్భంధించారు. అయితే ఆ యువకుడు సెరైకెలా పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాల్ మిత్ర పోలీస్ స్టేషన్‌లోని సెల్‌లో బెల్ట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫేస్ బుక్ ఇండియా హెడ్ పదవికి అజిత్ మోహన్ రాజీనామా.. స్నాప్ చాట్ లో చేరిక
ఈ ఘటన తర్వాత పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ ప్రకాష్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఇన్‌ఛార్జ్ అధికారి మనోహర్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాధ్యతలు స్వీకరించాల్సిందిగా సెరైకెలా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ అనూప్ మహతోను ఎస్పీ కోరారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్ ను సస్పెండ్ చేశామని, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల మేరకు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.