హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీవ్ర ఆస్తి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కులు సమీపంలోని బియాస్ నదిలో ఓ కారు అందరూ చూస్తుండగానే కొట్టుుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీని వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తోంది. వరద నీటి ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. రోడ్లపై, ఇంటి సమీపంలో పార్క్ చేసి ఉన్న కార్లు వరదల వేగాన్ని తట్టుకోలేకపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో దర్శినమిస్తున్నాయి. 

బీజేపీతో చర్చలు జరిపాం.. కానీ ఆ పార్టీతో చేతులు కలపలేదు - ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

కులు సమీపంలోని బియాస్ నదిలో ఓ కారు కొట్టుకుపోయిన వీడియో కూడా ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. వార్తా సంస్థ ‘పీటీఐ’ పోస్టు చేసిన వీడియోలో పార్క్ చేసిన కారు భారీ నీటి ప్రవాహంతో కొట్టుకుపోవడం, నదిలో మునిగిపోవడం గమనించవచ్చు.

Scroll to load tweet…

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వచ్చే 48 గంటల పాటు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, లౌహౌల్, స్పితి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసింది. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

చంబా, కాంగ్రా, కులు, మండి, ఉనా, హమీర్పూర్, బిలాస్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. సిమ్లా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో తమ అంచనాను పంచుకున్నామని, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, చెట్లు నేలకూలడంపై హెచ్చరికలు జారీ చేశామని ఐఎండీ అధికారి ఒకరు ‘హిందుస్థాన్ టైమ్స్’తో తెలిపారు. ఈ ఘటనలు నీరు, విద్యుత్ సరఫరాను కూడా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.

బ్లూ ఫిల్మ్ లు చూపిస్తూ, తన ఫ్రెండ్స్ తోనూ అలాగే గడపాలని భార్యపై భర్త ఒత్తిడి.. గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలంటూ

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, లాహౌల్, స్పితి, చంబా, సోలన్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటంతో పలు రహదారులు మూసుకుపోయాయి. గ్రామ్ ఫూ, చోటా ధర్రాలో ఆదివారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో 30 మంది కాలేజీ స్టూడెంట్లు చిక్కుకుపోయారు. వారిని అధికారులు సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని సమాచారం.సోలన్ జిల్లాలో శనివారం కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ జిల్లా అధికారులు కూలీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.